Uses of Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) in Telugu

Uses of Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) in Telugu:

Uses of Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) in Telugu:  Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) యొక్క ఉపయోగాలు:

Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) యొక్క ఉపయోగాలు:

Azstarys యొక్క జనెరిక్ పేరు: Serdexmethylphenidate and dexmethylphenidate. 

Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) క్యాప్సూల్స్ మెడిసిన్ అనేది 6 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అటెన్షన్-డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ADHD) చికిత్సకు ఉపయోగించే ఒక కేంద్ర నాడీ వ్యవస్థ ఉద్దీపన ప్రిస్క్రిప్షన్ మెడిసిన్. Azstarys మెడిసిన్ ADHDతో 6 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో శ్రద్ధను పెంచడానికి మరియు హఠాత్తుత్వం మరియు హైపర్యాక్టివిటీని తగ్గించడానికి సహాయపడుతుంది.

6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు Azstarys మెడిసిన్ సురక్షితమైనదా  మరియు సమర్థవంతమైనదా అనేది తెలియదు.

ముఖ్యమైన సమాచారం:

దుర్వినియోగం మరియు ఆధారపడటం: Azstarys మెడిసిన్ ఇతర మిథైల్ఫెనిడేట్ కలిగిన ఉత్పత్తులు మరియు యాంఫేటమిన్‌లతో సహా CNS ఉద్దీపనలు దుర్వినియోగం మరియు ఆధారపడటానికి ఎక్కువ అవకాశం కలిగి ఉంటాయి మరియు శారీరక మరియు మానసికంగా ఆధారపడటానికి కారణమవుతాయి. చికిత్సకు సూచించే ముందు దుర్వినియోగ ప్రమాదాన్ని మరియు ఆధారపడటం సంకేతాల కోసం అంచనా వేయాలి. మరియు చికిత్సలో ఉన్నప్పుడు దుర్వినియోగం మరియు ఆధారపడటం సంకేతాలను పర్యవేక్షించాలి.

Azstarys మెడిసిన్ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లకు కారణం కావచ్చు, వీటిలో:

బాధాకరమైన మరియు సుదీర్ఘమైన పెనిస్ స్టిఫ్ నెస్ (అంగస్తంభన) కలగవచ్చు (ప్రియాపిజం). మిథైల్ఫెనిడేట్ కలిగిన ఉత్పత్తులను తీసుకునే మగవారిలో ప్రియాపిజం ఏర్పడవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ఎదురైతే వెంటనే డాక్టర్ ని కలవాలి. 

చేతి వేళ్లు మరియు కాలి వేళ్లలో ప్రసరణ సమస్యలు అంటే, చేతి వేళ్లు లేదా కాలి వేళ్లు తిమ్మిరిగా, చల్లగా అనిపించవచ్చు లేదా నొప్పిగా ఉండవచ్చు. మరియు చేతి వేళ్లు లేదా కాలి వేళ్లు లేత, నీలం, ఎరుపు రంగులోకి మారవచ్చు. అలాగే చేతి వేళ్లు లేదా కాలి వేళ్లలో ఉష్ణోగ్రతకు సున్నితత్వం అనిపించవచ్చు. ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ని కలవాలి.

అలాగే, Azstarys మెడిసిన్ తో చికిత్స సమయంలో చేతి వేళ్లు లేదా కాలి వేళ్లపై వివరించలేని గాయాలు కనిపించినట్లయితే వెంటనే మీ డాక్టర్ ని కలవాలి.

Azstarys మెడిసిన్ తో పిల్లలలో పెరుగుదల (ఎత్తు మరియు బరువు) మందగించడం జరగవచ్చు. Azstarys మెడిసిన్ చికిత్స సమయంలో పిల్లలు వారి ఎత్తు మరియు బరువు తరచుగా తనిఖీ చేయాలి. మీ బిడ్డ ఎదగకపోతే లేదా బరువు పెరగకపోతే Azstarys చికిత్స నిలిపివేయబడవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు అనగా, పెద్దవారిలో ఆకస్మిక మరణం, స్ట్రోక్ మరియు గుండెపోటు కలగవచ్చు. గుండె సమస్యలు లేదా గుండె లోపాలు ఉన్న పిల్లలలో ఆకస్మిక మరణం సంభవించవచ్చు. అలాగే, రక్తపోటు మరియు హార్ట్ బీట్ పెరగవచ్చు. చికిత్స స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్ మరియు పిల్లల గుండె సమస్యల గురించి తనిఖీ చేయాలి. అలాగే, చికిత్స టైంలో  తరుచుగా BP మరియు హార్ట్ బీట్ తనిఖీ చేయాలి. 

మానసిక సమస్యలు అనగా, కొత్త లేదా అధ్వాన్నమైన ప్రవర్తన మరియు ఆలోచన సమస్యలు.
కొత్త లేదా అధ్వాన్నమైన బైపోలార్ అనారోగ్యం. కొత్త సైకోటిక్ లక్షణాలు (నిజమైనవి కాని వాటిని నమ్మడం లేదా చూడడం వంటివి) లేదా కొత్త ఉన్మాద ప్రవర్తనా లక్షణాలు మొదలైనవి. 

Azstarys మెడిసిన్ యొక్క అత్యంత సాధారణ సైడ్ ఎఫెక్ట్ లు: ఆకలి తగ్గడం, వికారం, అజీర్ణం, నిద్రకు ఇబ్బంది, వాంతులు, కడుపు నొప్పి, తల తిరగడం, మానసిక కల్లోలం, BP పెరగడం, ఆందోళన, చిరాకు, హార్ట్ బీట్ పెరగడం వంటివి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు ఉండవచ్చు. 

జాగ్రత్తలు: Azstarys మెడిసిన్ తీసుకునే ముందు గుండె సంబంధ వ్యాధులు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర గురించి అనగా, ఆకస్మిక మరణం, ఆత్మహత్య లేదా వెంట్రిక్యులర్ అరిథ్మియా యొక్క కుటుంబ చరిత్ర, సైకోసిస్, ఉన్మాదం, బైపోలార్ అనారోగ్యం లేదా డిప్రెషన్‌తో సహా మానసిక సమస్యల గురించి డాక్టర్ కి తెలియజేయాలి. అలాగే, మీ ప్రస్తుత వాడుతున్న మందుల జాబితాను డాక్టర్ కి తెలియజేయండి, ఉదా: విటమిన్లు, మూలికా మందులు, ఏమైనా  అలెర్జీలు, ముందుగా ఉన్న వ్యాధులు, మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అంటే, గర్భం, తల్లి పాలు ఇవ్వడం, రాబోయే శస్త్రచికిత్స మొదలైనవి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు లోనయ్యేలా చేస్తాయి. మీ డాక్టర్ చెప్పినట్టు పాటించడం లేదా ఉత్పత్తి మీద ముద్రించిన విధంగా పాటించాలి. సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు. ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల మీ లక్షణాలు మెరుగు పడవు, కాక విషప్రయోగం లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు మీ పరిస్థితిని బట్టి మోతాదు ఉంటుంది. మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి. మరియు మీ పరిస్థితి మెరుగుపడకపోతే లేదా అది మరింత దిగజారితే వెంటనే మీ డాక్టర్ ను కలవండి.

Azstarys మెడిసిన్ మోతాదు (డోస్) తీసుకోవడం: ఖచ్చితంగా డాక్టర్ సూచించిన విధంగా తీసుకోవాలి. Azstarys మెడిసిన్ నోటితో రోజుకు ఒకసారి ఉదయం ఆహారంతో లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. Azstarys క్యాప్సూల్స్‌ను నీరు లేదా ఇతర ద్రవాలతో పూర్తిగా మింగవచ్చు.
క్యాప్సూల్‌లను పూర్తిగా మింగలేకపోతే, క్యాప్సూల్‌ని తెరిచి, మొత్తం కంటెంట్‌లను 2 టేబుల్‌స్పూన్ల యాపిల్‌ సాస్‌లో లేదా 50 mL నీటిలో కలుపుకొని తీసుకోవచ్చు. Azstarys క్యాప్సూల్స్‌ను కలిపిన  యాపిల్‌సాస్ లేదా నీటి మిశ్రమాన్ని వెంటనే లేదా కలిపిన 10 నిమిషాలలోపు మింగండి. Azstarys క్యాప్సూల్స్‌ను కలిపిన యాపిల్‌సాస్ లేదా నీరు మరియు మెడిసిన్ మిశ్రమాన్ని నిల్వ చేయవద్దు.

మోతాదు (డోస్) మిస్ అయితే: మీరు మెడిసిన్ ఒక మోతాదు (డోస్) మిస్ అయితే, వెంటనే గమనించి తీసుకోండి. మీ సాధారణ మోతాదు తీసుకునే సమయానికి  తీసుకోండి. మెడిసిన్ మోతాదు (డోస్) మిస్ అయితే డబల్ డోస్ మాత్రం తీసుకోవద్దు. మోతాదు (డోస్) మిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే డాక్టర్ ని అడగండి. 

స్టోరేజ్: కాంతి మరియు తేమ నుండి దూరంగా (20°C నుండి 25°C) గది ఉష్ణోగ్రత వద్ద, సురక్షితమైన గట్టిగా మూసి ఉన్న డబ్బాలో నిల్వ చేయండి. బాత్రూం వంటి ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు. అన్ని మందులను పిల్లలు మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచండి, మరియు కలుషితం కాకుండా, సురక్షితంగా మరియు శుభ్రంగా స్టోరేజ్ చేయండి. 


Uses of Azstarys (serdexmethylphenidate and dexmethylphenidate) in Telugu:

Post a Comment

0 Comments