Sun Pharma, Jubilant and Aurobindo recall products from the US market

ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అయిన సన్ ఫార్మా, జుబిలెంట్ కాడిస్టా, అరబిందో ఫార్మా  కంపెనీలు 3 ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ లను వివిధ కారణాలతో అమెరికా మార్కెట్లో నుండి రీకాల్ చేస్తున్నాయి. 

Sun Pharma, Jubilant and Aurobindo recall products from the US market

Sun Pharma, Jubilant and Aurobindo recall products from the US market | సన్ ఫార్మా, జూబిలెంట్ మరియు అరబిందో US మార్కెట్ నుండి ఉత్పత్తులను రీకాల్ చేశాయి:


ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అయిన సన్ ఫార్మా, జుబిలెంట్ కాడిస్టా, అరబిందో ఫార్మా  కంపెనీలు వివిధ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్ లను వివిధ కారణాలతో అమెరికా మార్కెట్లో నుండి రీకాల్ చేస్తున్నాయని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) యొక్క ఏప్రిల్ నెల ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ తెలిపింది. 

సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్: Cequa (Cyclosporine ophthalmic solution) అనే మెడిసిన్, ప్రొడక్ట్ క్వాన్టిటి 73,030 బాక్సులను, Subpotent Drug and Presence of Particulate Matter: low out-of-specification results obtained for assay and the presence of particulate matter అనే కారణంతో రీకాల్ చేస్తుంది. ఈ మెడిసిన్ ను (Dry eyes) కళ్ళలో సహజ కన్నీటి ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. 

జుబిలెంట్ కాడిస్టా: Methylprednisolone Tablets అనే మెడిసిన్, ప్రొడక్ట్ క్వాన్టిటి 19,222 బాటిల్లను, Subpotent Drug అనే కారణంతో రీకాల్ చేస్తుంది. ఈ మెడిసిన్ ను వాపు, తీవ్రమైన అలెర్జీలు, అడ్రినల్ సమస్యలు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తం లేదా ఎముక మజ్జ సమస్యలు, కంటి లేదా దృష్టి సమస్యలు, లూపస్, చర్మ పరిస్థితులు, మూత్రపిండాల సమస్యలు, వ్రణోత్పత్తి పెద్దప్రేగు వంటి అనేక విభిన్న పరిస్థితులకు చికిత్స చేయడానికి ఇది ఉపయోగిస్తారు.   

అరబిందో ఫార్మా: Cyanocobalamin Injection అనే మెడిసిన్, ప్రొడక్ట్ క్వాన్టిటి 4,33,809 వయల్స్ ను, Subpotent Drug: Out of Specification results for Assay అనే కారణంతో రీకాల్ చేస్తుంది. ఈ మెడిసిన్ ను విటమిన్ B12 లోపానికి చికిత్స చేయడానికి మరియు నిరోధించడానికి ఉపయోగిస్తారు.

అయితే ఈ రీకాల్స్ ను క్లాస్ 3 గా వర్గీకరించినట్టు US FDA ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ పేర్కొంది. అస్వస్థత కలిగించే అవకాశం లేని లేదా ప్రతికూల ఆరోగ్య పర్యవసానాలను కలిగించే అవకాశం లేని, మరియు FDA నిబంధనలను ఉల్లంఘించే ప్రొడక్ట్ ల కోసం ఈ పరిస్థితిలో రీకాల్స్ ప్రారంభించబడింది. ఈ రీకాల్స్ ప్రస్తుతం ఆన్ గోయింగ్ స్టేటస్ లో ఉన్నాయి.  


Sun Pharma, Jubilant and Aurobindo recall products from the US market:

Post a Comment

0 Comments