Uses of Azo Gantrisin (Phenazopyridine and Sulfisoxazole) in Telugu

Uses of Azo Gantrisin (Phenazopyridine and Sulfisoxazole) in Telugu:

Uses of Azo Gantrisin (Phenazopyridine and Sulfisoxazole) in Telugu | Azo Gantrisin (ఫెనాజోపైరిడిన్ మరియు సల్ఫీసోక్సాజోల్) యొక్క ఉపయోగాలు తెలుగులో:

Azo Gantrisin (ఫెనాజోపైరిడిన్ మరియు సల్ఫీసోక్సాజోల్) యొక్క ఉపయోగాలు తెలుగులో:

అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) యొక్క జనెరిక్ పేరు: ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్ (Phenazopyridine Hydrochloride and Sulfisoxazole). 

ఉపయోగాలు: అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ ల కాంబినేషన్, టాబ్లెట్ రూపంలో లభిస్తుంది. ఈ మెడిసిన్ మూత్రనాళ మార్గము (మూత్రపిండము, మూత్రాశయం) యొక్క అంటువ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. సల్ఫిసోక్సాజోల్ అనేది అనేక రకాల ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయడంలో ప్రభావవంతమైన సల్ఫా రకం యాంటీబయాటిక్. ఫెనాజోపిరిడిన్ మూత్రనాళ మార్గము అంటువ్యాధుల నొప్పిని, లక్షణాలను తగ్గిస్తుంది. 

సైడ్ ఎఫెక్ట్ లు: అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ లు కడుపు నొప్పి, మైకం, విరేచనాలు, వికారం, తలనొప్పి లేదా వాంతులు కలిగించవచ్చు, అలాగే మూత్రం నారింజ గోధుమ రంగులోకి మారవచ్చు. దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు మెడిసిన్ తీసుకోవడం ఆపినప్పుడు ఈ సమస్య పోతుంది. ఎందుకంటే మొదట కొన్ని రోజులు శరీరం మెడిసిన్ లకు సర్దుబాటు కావాలి. ఒకవేళా ఈ లక్షణాలు అలాగే కొనసాగితే లేదా తీవ్రంగా మారితే, వెంటనే డాక్టర్ ని కలవండి. అలెర్జీ సమస్యలు అంటే, దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఇంకా ఏవైనా ఇతర ఇబ్బందులను గమనిస్తే వెంటనే డాక్టర్ ని కలవండి. చాలా అరుదుగా, ఈ మెడిసిన్ వలన స్టీవెన్స్ - జాన్సన్ సిండ్రోమ్ అని పిలువబడే తీవ్రమైన చర్మపు దద్దుర్లు, బ్లడ్ డిసార్డర్ (ఉదా: అగ్రన్యులోసైటోసిస్, అప్లాస్టిక్ అనీమియా) లేదా కాలేయం దెబ్బతినడం వంటి తీవ్రమైన, ప్రాణాంతకమైన సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు.

జాగ్రత్తలు: అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ తీసుకునే ముందు, మీరు ప్రస్తుతం వాడుతున్న మెడిసిన్ మరియు ఇతర జాబితాను డాక్టర్ కి తెలియజేయండి, ఉదా: విటమిన్లు, ఏవైనా మందులు, మూలికా మందులు, మరియు ఇతర అలెర్జీలు, ముందుగా ఉన్న వ్యాధులు, మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అంటే, గర్భం, తల్లి పాలు ఇవ్వడం, రాబోయే శస్త్రచికిత్స మొదలైనవి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు లోనయ్యేలా చేస్తాయి. ఈ మెడిసిన్ వలన సూర్యరశ్మికి ఇబ్బంది అనిపించవచ్చు. మీ డాక్టర్ చెప్పినట్టు పాటించడం లేదా ఉత్పత్తి మీద ముద్రించిన విధంగా పాటించాలి. సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు. ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల మీ లక్షణాలు మెరుగు పడవు, కాక విషప్రయోగం లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు మీ పరిస్థితిని బట్టి మోతాదు ఉంటుంది. మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి. మీ పరిస్థితి ఇంకా అలాగే ఉంటే లేదా ఎక్కువ అయితే మరియు మీ పరిస్థితి మెరుగుపడకపోతే లేదా మీ పరిస్థితి దిగజారితే వెంటనే మీ డాక్టర్ ను కలవండి.

మోతాదు (డోస్) తీసుకోవడం: అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ ను మీ డాక్టర్ చెప్పినట్టుగా తీసుకోవాలి. ప్రతి మోతాదు (డోస్) ను ఒక పూర్తి గ్లాసు నీటితో తీసుకోవాలి మరియు ఈ మెడిసిన్ని తీసుకునేటప్పుడు ఎక్కువగా ద్రవాలు త్రాగండి. మీ శరీరంలో మెడిసిన్ మొత్తం స్థిరమైన స్థాయిలో ఉంచబడినప్పుడు యాంటీబయాటిక్స్ మంచిగా పని చేస్తాయి. అంటే క్రమం తప్పకుండా మెడిసిన్ ప్రతి మోతాదు (డోస్) ను తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత లక్షణాలు కనిపించకుండా పోయినప్పటికీ, డాక్టర్ సూచించిన మెడిసిన్ కోర్స్ మొత్తం పూర్తయ్యే వరకు ఈ మందులను తీసుకోవడం కొనసాగించండి. మందులను ముందుగానే ఆపడం వలన ఇన్ఫెక్షన్ కు కారణమైన బ్యాక్టీరియా వృద్ధి చెందడం తిరిగి కొనసాగించవచ్చు, ఫలితంగా ఇన్ఫెక్షన్ తిరిగి వస్తుంది.

మోతాదు (డోస్) మిస్ అయితే: మీరు అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ తీసుకోవడంలో ఒక మోతాదు (డోస్) మిస్ అయితే, వెంటనే గమనించి తీసుకోండి. ఒకవేళ ఇది తర్వాత మోతాదు (డోస్) తీసుకోవలసిన టైంకి దగ్గరగా ఉంటే, మిస్ అయిన మోతాదును (డోస్) తీసుకోకుండా, మీ సాధారణ మోతాదు (డోస్) తీసుకునే టైంకి తీసుకోండి. మెడిసిన్ మోతాదు (డోస్) మిస్ అయితే డబల్ డోస్ మాత్రం తీసుకోవద్దు. 

స్టోరేజ్: అజో గాంట్రిసిన్ (Azo Gantrisin) (ఫెనాజోపిరిడిన్ హైడ్రోక్లోరైడ్ మరియు సల్ఫిసోక్సాజోల్) మెడిసిన్ ను కాంతి మరియు తేమ నుండి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. బాత్రూం వంటి ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు. అన్ని మందులను పిల్లలు మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచండి, మరియు కలుషితం కాకుండా సేఫ్ గా స్టోరేజ్ చెయ్యాలి. 


Uses of Azo Gantrisin (Phenazopyridine and Sulfisoxazole) in Telugu:

Post a Comment

0 Comments