Vaccine means what? in Telugu

TELUGU GMP
0
Vaccine means what? in Telugu

వ్యాక్సిన్ అంటే ఏమిటి?

వ్యాక్సిన్: ఒక నిర్దిష్ట వ్యాధికి (A specific disease) రోగనిరోధక శక్తిని (Immunity) ఉత్పత్తి చేయడానికి ఒక వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తిని (Immune system) ప్రేరేపించే (Stimulate) ఒక ప్రోడక్ట్ నే (Product) వ్యాక్సిన్ (Vaccine) అంటారు. అనగా ఒక నిర్దిష్ట వ్యాధిని (Specific disease) గుర్తించడానికి మరియు రక్షించడానికి (Recognize and defend) శరీరం యొక్క సొంత రోగనిరోధక శక్తిని (Body's own immune system) సిద్ధం (Prepare) చేయడం ద్వారా వ్యాక్సిన్ (Vaccine) పనిచేస్తుంది. ఆ వ్యాధి నుండి వ్యక్తిని కాపాడుతుంది. వ్యాక్సిన్లు (Vaccines) సాధారణంగా సూది ఇంజెక్షన్ల ద్వారా ఇవ్వబడతాయి, కానీ నోటి ద్వారా కూడా ఇవ్వవచ్చు లేదా ముక్కులోనికి స్ప్రే కూడా చేయవచ్చు. (వ్యాక్సిన్లకు (Vaccines) దశాబ్దాల వైద్య పరిశోధనలు (Decades of medical research) మద్దతు ఇస్తున్నాయి.)

వ్యాక్సిన్లు (Vaccines) శరీర రక్షణను పెంపొందించడానికి (To build protection of body's) మీ శరీరం యొక్క సహజ రక్షణతో (body’s natural defenses) పనిచేయడం ద్వారా వ్యాధి వచ్చే ప్రమాదాలను తగ్గిస్తాయి. మీరు వ్యాక్సిన్ (Vaccine) పొందినప్పుడు, మీ రోగనిరోధక వ్యవస్థ (Immune system) ప్రతిస్పందిస్తుంది అందువలన మీరు రక్షించబడుతారు.

ప్రతి సంవత్సరం మిలియన్ల మంది ప్రాణాలను (Millions of lives) వ్యాక్సిన్లు (Vaccines) కాపాడుతున్నాయి. ఇప్పుడు 20 కంటే ఎక్కువ ప్రాణాంతక వ్యాధులను (Life-threatening diseases) నివారించడానికి (Prevent) వ్యాక్సిన్లు (Vaccines) ఉన్నాయి, అన్ని వయసుల ప్రజలు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడుతున్నాయి. వ్యాక్సిన్లు (Vaccines) వేయడం వలన రోగనిరోధకత ప్రస్తుతం ప్రతి సంవత్సరం 2-3 మిలియన్ల మరణాలను కంఠవాతం (Diphtheria), ధనుర్వాతం (Tetanus), కోరింత దగ్గు (Pertussis), పోలియో (Polio), ఫ్లూ (అంటురోగము) (Influenza) మరియు తట్టు (Measles) వంటి వ్యాధుల నుండి నిరోధిస్తుంది (Prevents).

అంటువ్యాధుల వ్యాప్తిని (Infectious diseases outbreaks) నివారించడానికి మరియు నియంత్రించడానికి వ్యాక్సిన్ లు (Vaccines) కూడా కీలకం. యాంటీమైక్రోబయల్ నిరోధకతకు (Antimicrobial resistance) వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో ఇది ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది. 

అయినా ఇంత అద్భుతమైన పురోగతి (Tremendous progress) ఉన్నప్పటికీ, ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది శిశువులతో (Infants) సహా ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వ్యాక్సిన్లు (Vaccines) తగినంతగా అందుబాటులో లేవు. 


Vaccine means what? in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)