How many types of Covid-19 vaccines are there? in Telugu

Sathyanarayana M.Sc.
0
ఎన్ని రకాల కోవిడ్-19 వ్యాక్సిన్ లు ఉన్నాయి? ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు Covid-19 కోసం అనేక రకాల పొటెన్సీయల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసారు మరియు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ లు అన్నీ కూడా Covid-19 కు కారణమయ్యే వైరస్ ను సురక్షితంగా గుర్తించడానికి మరియు నిరోధించడానికి శరీర రోగనిరోధక వ్యవస్థకు (Body's Immune system) బోధించడానికి లేదా నేర్పించడానికి రూపొందించబడ్డాయి.

ఎన్ని రకాల కోవిడ్-19 వ్యాక్సిన్ లు ఉన్నాయి?

ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు Covid-19 కోసం అనేక రకాల పొటెన్సీయల్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసారు మరియు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ లు అన్నీ కూడా Covid-19 కు కారణమయ్యే వైరస్ ను సురక్షితంగా గుర్తించడానికి మరియు నిరోధించడానికి శరీర రోగనిరోధక వ్యవస్థకు (Body's Immune system) బోధించడానికి లేదా నేర్పించడానికి రూపొందించబడ్డాయి.

Covid-19 కొరకు అనేక విభిన్న రకాల పొటెన్సీయల్ వ్యాక్సిన్లు ఉన్నాయి, వీటిలో:

➢ Inactivated or weakened virus vaccines: క్రియారహితం చేయబడిన (Inactivated) లేదా బలహీనమైన వైరస్ వ్యాక్సిన్లు (Weakened virus vaccines), ఇవి క్రియారహితం చేయబడిన లేదా బలహీనమైన వైరస్ యొక్క రూపాన్ని ఉపయోగిస్తాయి, కనుక ఇది వ్యాధికి కారణం కాదు లేదా వ్యాధిని కలిగించదు, కానీ ఇప్పటికీ రోగనిరోధక ప్రతిస్పందనను (Immune response) ఉత్పత్తి చేస్తుంది. ఉదాహరణకు, భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాక్జిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ (Covaxin Covid-19 Vaccine). 

➢ Protein based vaccines: ప్రోటీన్ ఆధారిత వ్యాక్సిన్లు, ఇది రోగనిరోధక ప్రతిస్పందనను (Immune response) సురక్షితంగా ఉత్పత్తి (Safely generate) చేయడానికి Covid-19 వైరస్‌ను అనుకరించే ప్రోటీన్‌ల ప్రమాదరహిత శకలాలు (Harmless fragments) లేదా ప్రోటీన్ షెల్‌లను ఉపయోగిస్తాయి.
ఉదాహరణకు, మెడిజెన్ వ్యాక్సిన్ బయోలాజిక్స్ సంస్థ అభివృద్ధి చేసిన MVC-COV1901 కోవిడ్-19 వ్యాక్సిన్ (MVC-COV1901 Covid-19 Vaccine). 

➢ Viral vector vaccines: వైరల్ వెక్టర్ వ్యాక్సిన్లు, ఇవి వ్యాధిని కలిగించలేని సురక్షితమైన వైరస్ ని ఉపయోగిస్తాయి, అయితే రోగనిరోధక ప్రతిస్పందనను (Immune response) ఉత్పత్తి చేయడం కొరకు కరోనావైరస్ ప్రోటీన్ లను ఉత్పత్తి చేయడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఉదాహరణకు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన Oxford-AstraZeneca Covid-19 vaccine మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తయారు చేసిన కోవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ (Covishield Covid-19 Vaccine). 

➢ RNA and DNA vaccines: RNA మరియు DNA వ్యాక్సిన్ లు, జన్యుపరంగా రూపొందించబడ్డ (Genetically engineered) RNA మరియు DNA ని ఉపయోగించి రోగనిరోధక ప్రతిస్పందనను (Immune response) సురక్షితంగా ప్రేరేపించే ప్రోటీన్ ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే అత్యాధునిక విధానం (Cutting edge approach). ఉదాహరణకు, Pfizer-BioNTech అభివృద్ధి చేసిన కామిర్నటీ కోవిడ్-19 వ్యాక్సిన్ (Comirnaty Covid-19 Vaccine). 


How many types of Covid-19 vaccines are there? in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)