Why it’s normal to have mild side effects from vaccines? in Telugu

TELUGU GMP
0
వ్యాక్సిన్ ల నుంచి తేలికపాటి సైడ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉండటం ఎందుకు సాధారణం?  మనకు వ్యాధి రాకుండా మరియు వ్యాధిని పొందే ప్రమాదాలు లేకుండా ఉండడానికి మన శరీరానికి రోగనిరోధక శక్తిని (Immunity) అందించడానికి వ్యాక్సిన్ లు (Vaccines) రూపొందించబడ్డాయి. వ్యాక్సిన్ లు తీసుకున్నప్పుడు కొన్ని తేలికపాటి నుంచి ఒక మాదిరి సైడ్ ఎఫెక్ట్‌లను (Some mild to moderate side effects) అనుభవించడం సాధారణం.

వ్యాక్సిన్ ల నుంచి తేలికపాటి సైడ్ ఎఫెక్ట్‌లను కలిగి ఉండటం ఎందుకు సాధారణం?

మనకు వ్యాధి రాకుండా మరియు వ్యాధిని పొందే ప్రమాదాలు లేకుండా ఉండడానికి మన శరీరానికి రోగనిరోధక శక్తిని (Immunity) అందించడానికి వ్యాక్సిన్ లు (Vaccines) రూపొందించబడ్డాయి. వ్యాక్సిన్ లు తీసుకున్నప్పుడు కొన్ని తేలికపాటి నుంచి ఒక మాదిరి సైడ్ ఎఫెక్ట్‌లను (Some mild to moderate side effects) అనుభవించడం సాధారణం. ఎందుకంటే మన రోగనిరోధక వ్యవస్థ (Immune system) మన శరీరాన్ని కొన్ని విధాలుగా ప్రతిస్పందించమని సూచించడం దీనికి కారణం. ఇది మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది (Increases blood flow), తద్వారా ఎక్కువ రోగనిరోధక కణాలు (More immune cells) మన శరీరం అంతటా వ్యాప్తి చెందుతాయి, మరియు వైరస్ ను చంపడానికి (To kill the virus) ఇది మన శరీర టెంపరేచర్ ను పెంచుతుంది.


తక్కువ గ్రేడ్ జ్వరం (Low grade fever) లేదా కండరాల నొప్పులు (Muscle aches) వంటి తేలికపాటి నుండి ఒక మాదిరి సైడ్ ఎఫెక్ట్‌లు సాధారణమైనవి. అవి శరీర రోగనిరోధక వ్యవస్థ (Body's immune system) వ్యాక్సిన్ కు ప్రత్యేకించి యాంటిజెన్‌కి ప్రతిస్పందిస్తున్నట్లు సంకేతాలు, (యాంటీజెన్ అనగా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపించే ఒక పదార్థం - A substance that triggers an immune response), మరియు వైరస్ తో పోరాడటానికి సిద్ధమవుతోంది. ఈ సైడ్ ఎఫెక్ట్‌లు సాధారణంగా కొన్ని రోజుల తరువాత స్వయంగా వాటికవే పోతాయి.

సాధారణ మరియు తేలికపాటి లేదా ఒక మాదిరి సైడ్ ఎఫెక్ట్‌లు (Common and mild or moderate side effects) అనేవి మంచి విషయం, ఎందుకంటే వ్యాక్సిన్ పనిచేస్తుందని అవి మనకు చూపిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లు లేనట్లయితే వ్యాక్సిన్ అసమర్థంగా (Ineffective) ఉందని అర్థం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం ఒకే విదంగా కాకుండా భిన్నంగా ప్రతిస్పందిస్తుందని దీని అర్థం. 


Why it’s normal to have mild side effects from vaccines? in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)