Complaints and Recalls in Telugu

TELUGU GMP
0

GMP GUIDELINES FOR API IN TELUGU

Complaints and Recalls in Telugu:


➤ అన్ని క్వాలిటీ సంబంధిత కంప్లైంట్స్ (Complaints), మౌఖికంగా (Orally) లేదా వ్రాతపూర్వకంగా (Writing) స్వీకరించినా, వ్రాతపూర్వక విధానం (Written Procedure) ప్రకారం రికార్డ్ చేసి దర్యాప్తు (Investigation) చేయాలి.


➤ కంప్లైంట్ (Complaint) రికార్డులలో ఈ క్రింది విషయాలు ఉండాలి.


  • ఫిర్యాదుదారుడి (Complainant) పేరు మరియు చిరునామా.
  • కంప్లైంట్ (Complaint) సమర్పించే వ్యక్తి పేరు (మరియు తగిన చోట టైటిల్) మరియు ఫోన్ నంబర్. 
  • కంప్లైంట్ స్వభావం (Complaint Nature) (API యొక్క పేరు మరియు బ్యాచ్ నంబర్తో సహా ఉండాలి). 
  • కంప్లైంట్ (Complaint) స్వీకరించబడిన తేదీ ఉండాలి. 
  • ప్రారంభంలో తీసుకున్న చర్య (చర్య తీసుకునే వ్యక్తి యొక్క గుర్తింపుతో సహా మరియు తేదీలు ఉండాలి).  
  • ఏదైనా తదుపరి చర్య తీసుకోబడుతుంది (Any follow up action taken).
  • కంప్లైంట్ (Complaint) యొక్క మెయిన్ పర్సన్ కు రెస్పాన్స్ అందించబడింది (రెస్పాన్స్ పంపిన తేదీతో సహా ఉండాలి). 
  • Intermediate or API బ్యాచ్ లేదా లాట్ పై తుది నిర్ణయం (Final Decision).

➤ ట్రెండ్ లు ప్రోడక్ట్ సంబంధిత ఫ్రిక్వెన్సీలు మరియు తీవ్రతను అంచనా వేయడానికి కంప్లైంట్స్ (Complaints) రికార్డులను నిలుపుకోవాలి (Should be Retained) మరియు అదనపు అవసరమయితే తక్షణం ద్దిద్దుబాటు చర్య (Immediate Corrective Action) ఉండాలి.


➤ Intermediate or API యొక్క రీ కాల్ ను పరిగణించవలసిన పరిస్థితులను నిర్వచించే వ్రాతపూర్వక విధానం (Written Procedure) ఉండాలి.


➤ రీ కాల్ విధానం (Recall Procedure) సమాచారాన్ని అంచనా వేయడంలో ఎవరు పాల్గొనాలి, రీ కాల్ ఎలా  ప్రారంభించాలి, రీ కాల్ గురించి ఎవరికి తెలియజేయాలి మరియు రీ కాల్ చేయబడిన మెటీరియల్ను ఎలా ట్రీట్ చేయాలి అనేవి నిర్దేశించాలి.


➤ తీవ్రమైన (Serious) లేదా ప్రాణాంతక పరిస్థితి (Life-threatening Situation) ఏర్పడితే, లోకల్, నేషనల్, మరియు / లేదా ఇంటర్నేషనల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి మరియు వారి సలహాలను కోరాలి.


Complaints and Recalls in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)