How many covid-19 vaccines are there in the world? in Telugu

Sathyanarayana M.Sc.
0
How many covid-19 vaccines are there in the world? in Telugu

ప్రపంచంలో ఎన్ని కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఉన్నాయి?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అనేక వ్యాక్సిన్ లు (Vaccines) ఉపయోగంలో ఉన్నాయి. మొదటి సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం డిసెంబర్ 2020 ప్రారంభంలో ప్రారంభమైంది. కనీసం 16 విభిన్న వ్యాక్సిన్ లు (4 ఫ్లాట్ ఫారాల్లో) ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలో ఇవ్వబడుతున్నాయి.

ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL - Emergency Use Listing) కోసం జాబితా చేయబడిన వ్యాక్సిన్ల వివరాలు:

1). ఫైజర్/బయోఎన్ టెక్ కొమిర్నాటి COVID-19 వ్యాక్సిన్ 31 డిసెంబర్ 2020 న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL) కోసం జాబితా చేయబడింది. 

2). SII / Covishield మరియు AstraZeneca / AZD1222 COVID-19 వ్యాక్సిన్లకు (ఆస్ట్రాజెనెకా/ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది మరియు వరుసగా సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు SK బయో ద్వారా తయారు చేయబడింది) 15 ఫిబ్రవరి 2021 న EUL ఇవ్వబడింది. 

3). జాన్సన్ & జాన్సన్ అభివృద్ధి చేసిన జాన్సెన్ / Ad26.COV 2.S, 12 మార్చి 2021 న EUL కొరకు జాబితా చేయబడింది. 

4). మోడరనా COVID-19 వ్యాక్సిన్ (mRNA 1273) 30 ఏప్రిల్ 2021 న EUL కొరకు జాబితా చేయబడింది మరియు 

5). సినోఫార్మ్ COVID-19 వ్యాక్సిన్ 7 మే 2021 న EUL కొరకు జాబితా చేయబడింది. చైనా నేషనల్ బయోటెక్ గ్రూప్ (CNBG) అనుబంధ సంస్థ అయిన బీజింగ్ బయో-ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ కో లిమిటెడ్ ద్వారా సినోఫార్మ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయబడింది. 

6). సినోవాక్-కరోనావాక్ COVID-19 వ్యాక్సిన్ 1 జూన్ 2021 న EUL కొరకు జాబితా చేయబడింది. 

7). AstraZeneca / AZD1222 (ఆస్ట్రాజెనెకా / ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ) 2 వ్యాక్సిన్లు 9 జులై 2021 న EUL కొరకు జాబితా చేయబడ్డాయి. 

ఇంకా మిగతా వ్యాక్సిన్లు మూడవ దశ క్లినికల్ ట్రైల్స్ ఫలితాలను బట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL) కోసం ఫైనలైస్ తేదీలు ప్రకటించాల్సి ఉన్నాయి. అందులో,

8). భారత్ బయోటెక్ ఇండియా సంస్థ అభివృద్ధి చేసిన కొవాక్సీన్ Covid-19 వ్యాక్సిన్ (Covaxin Covid-19 Vaccine) మూడవ దశ క్లినికల్ ట్రైల్స్ ఫలితాలు 06 జులై 2021 న ప్రకటించింది. మరియు మూడవ దశ క్లినికల్ ట్రైల్స్ ఫలితాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు సమర్పించింది, అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర వినియోగ జాబితా (EUL) కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తుది నిర్ణయం తేదీ (Final decision date) ప్రకటించవలసి ఉంది. 

అయితే ఇక్కడ చాలా కోవిడ్-19 వ్యాక్సిన్లు రెండవ దశ క్లినికల్ ట్రైల్స్ రిజల్ట్స్ ను బట్టి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి (Public health emergency) వినియోగం క్రింద మూడవ దశ క్లినికల్ ట్రైల్స్ రిజల్ట్స్ రాకుండానే ఆయా దేశాలు డ్రగ్స్ కంట్రోలర్స్ లేదా డ్రగ్స్ రెగ్యులేటరీ సంస్థల అనుమతితో కరోనావైరస్ మహమ్మారి నుండి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడం జరిగింది మరియు జరుగుతుంది.  


How many covid-19 vaccines are there in the world? in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)