What happens to people who get COVID-19 (Coronavirus)? in Telugu

TELUGU GMP
0
కోవిడ్-19 (కరోనావైరస్) పొందే వ్యక్తులకు ఏమి జరుగుతుంది? కోవిడ్-19 (కరోనావైరస్) ఇన్ఫెక్షన్ సోకి లక్షణాలు (Symptoms) అభివృద్ధి చెందిన వారిలో చాలా మంది ప్రజలు (సుమారు 80% మంది) హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధి నుంచి కోలుకుంటారు. సుమారు 15% మంది ప్రజలు సీరియస్ గా అనారోగ్యానికి గురవుతారు మరియు వీరికి ఆక్సిజన్ అవసరం అవుతుంది మరియు 5% మంది ప్రజలు ఇంకా చాలా సీరియస్ గా అనారోగ్యానికి గురవుతారు మరియు వీరికి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.

కోవిడ్-19 (కరోనావైరస్) పొందే వ్యక్తులకు ఏమి జరుగుతుంది?

కోవిడ్-19 (కరోనావైరస్) ఇన్ఫెక్షన్ సోకి లక్షణాలు (Symptoms) అభివృద్ధి చెందిన వారిలో చాలా మంది ప్రజలు (సుమారు 80% మంది) హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే కోవిడ్-19 (కరోనావైరస్) వ్యాధి నుంచి కోలుకుంటారు. సుమారు 15% మంది ప్రజలు సీరియస్ గా అనారోగ్యానికి గురవుతారు మరియు వీరికి ఆక్సిజన్ అవసరం అవుతుంది మరియు 5% మంది ప్రజలు ఇంకా చాలా సీరియస్ గా అనారోగ్యానికి గురవుతారు మరియు వీరికి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది.


శ్వాస కోశ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం (Respiratory system failure), తీవ్రమైన ఊపిరి తీసుకోవడం బాధగల సిండ్రోమ్ (Acute Respiratory Distress Syndrome - ARDS), సెప్సిస్ (సెప్సిస్ అంటే  ఇన్ఫెక్షన్ కు శరీరం యొక్క తీవ్రమైన ప్రతిస్పందన. ఇది ప్రాణాంతక వైద్య అత్యవసర పరిస్థితి) మరియు సెప్టిక్ షాక్ (సెప్టిక్ షాక్ అంటే విస్తృతమైన ఇన్ఫెక్షన్ వలన ప్రమాదకరంగా తక్కువ రక్తపోటు (Low blood pressure) అనగా రక్తపోటు ఫెయిల్ అవుతుంది (Blood pressure fails) దీని  వలన శరీరంలోని అవయవాలు (Organs) తగినంత ఆక్సిజన్ పొందడంలో ఫెయిల్ అవుతాయి అప్పుడు అవయవాలు ఫెయిల్ (Organs fail) అవుతాయి మరియు అవయవాలు పని చేయడం ఆగిపోతుంది), థ్రాంబోఎంబోలిజం (థ్రాంబోఎంబోలిజం అంటే రక్తనాళాలలో రక్తము గడ్డకట్టడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ ), మరియు/లేదా గుండె (Heart), కాలేయం (Liver) లేదా మూత్రపిండాల (Kidneys) గాయంతో (Injury) సహా మల్టీపుల్ అవయవాలు (Multiple Organs) ఫెయిల్ అవ్వడం  వంటివి మరణానికి దారితీయవచ్చు.        


అరుదైన పరిస్థితుల్లో, ఇన్ఫెక్షన్ తరువాత కొన్ని వారాల తరువాత పిల్లలకు తీవ్రమైన ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అభివృద్ధి చెందవచ్చు. 


60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, మరియు అధిక రక్తపోటు (High blood pressure), గుండె మరియు ఊపిరితిత్తుల సమస్యలు (Heart and lung problems), మధుమేహం (Diabetes), ఊబకాయం లేదా క్యాన్సర్ (Obesity or cancer) వంటి అంతర్లీన వైద్య సమస్యలు (Underlying medical problems) ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యం (Serious illness) అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 


అయితే, ఎవరైనా కోవిడ్-19 (కరోనావైరస్) తో అనారోగ్యానికి గురి అవుతారు మరియు సీరియస్ గా అస్వస్థతకు గురికావచ్చు లేదా ఏ వయస్సులో వారైనా మరణించవచ్చు.


కొవిడ్-19 (కరోనావైరస్) ఉన్న కొంతమంది వ్యక్తులు, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నా లేదా లేకపోయినా, అలసట (Fatigue), ఊపిరి తీసుకోవడం ఇబ్బంది మరియు నరాల లక్షణాలతో సహా కొన్ని లక్షణాలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు.


What happens to people who get COVID-19 (Coronavirus)? in Telugu:


Post a Comment

0Comments

Post a Comment (0)