మానవ జీవితంలో ప్రకృతి వైద్యం యొక్క ప్రాముఖ్యత | The importance of naturopathy in human life in Telugu

TELUGU GMP
0
మానవ జీవితంలో ప్రకృతి వైద్యం యొక్క ప్రాముఖ్యత | The importance of naturopathy in human life in Telugu

మానవ జీవితంలో ప్రకృతి వైద్యం యొక్క ప్రాముఖ్యత:

ఈ ప్రపంచంలో అందరు ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటారు ఆ ప్రయత్నం లో భాగంగా అందరు ఇంత కాలం రకరకాల వైద్య విధానాలను ఆశ్రయించారు, కొందరు హోమియోపతి, కొందరు ఆయుర్వేదం, కొందరు అల్లోపతి, మరి కొందరు యునాని. ఇలా ఎన్నో సంవత్సరాలుగా రకరకాల వైద్య విధానాలను ఆశ్రయించి వాటి ద్వారా రోగాలు నయంకావడానికి కావలిసిన మందులను శరీరానికి తీసుకుంటున్నారు. అయితే, మందులు చేయాల్సిన పని అవి చేస్తున్నాయి, రోగాల నుండి ఉపశమనం లబిస్తుంది. 

అయితే, వీరందరూ పూర్తి ఆరోగ్యంగా ఆనందంగా కోరుకున్నవిధంగా జీవించగలుగుతున్నారా ?, అంటే సరైన ఆరోగ్య రక్షణ వ్యవస్థతో ఈ ప్రకృతిలో హాయిగా తిరుగుతున్నారా ?, ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి (ఉదా: కరోనా మహమ్మారి (Covid-19 virus) కనీసం బయట తిరగనివ్వడం లేదు). మరి ఇలా మనకెందుకు మంచి ఆరోగ్యం అనేది నెరవేరటం లేదు, మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం, మనం ఆశించిన ఆరోగ్యాన్ని ఎందుకు సాధించలేకపోతున్నాం, ఇలాంటి ప్రశ్నలు చాలా మందిలో మెదులుతుంటాయి. ఇలాంటి వాటికి చక్కటి సమాధానమే ప్రకృతి వైద్య విధానం. 

మీరు అనేక వైద్య విధానాలను విన్నారు కదా, అలాగే ఇది కూడా ఒక మంచి వైద్య విధానం, అదే ప్రకృతి వైద్య విధానం (న్యాచురోపతి). ఈ న్యాచురోపతి విధానం న్యాచురల్ గా ఆరోగ్యాన్ని జీవరాశులకు మనుషులకు అందించే విధానం. ఆ జీవన విధానాన్ని ఆరోగ్యాన్ని సంరక్షించే మార్గాల్ని అందించేదియే ఈ న్యాచురోపతి విధానం. మరి మీరు ఇంత కాలం అన్నింటికీ ఛాన్స్ ఇచ్చారు, ఒక్కసారి ఈ న్యాచురోపతి విధానానికి పూర్తిగా ఛాన్స్ ఇచ్చి చూడండి, ఎన్ని మార్పులు వస్తాయో గమనించి చూడండి. 

న్యాచురోపతి అంటే, మంచి అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవన విధానమే న్యాచురోపతిలోని మందులు, వేరే మందులు అంటే కషాయాలు, ఆకు పసర్లు వంటివి ఏమి ఉండవు, కేవలం మంచి అలవాట్లు మాత్రమే ఉంటాయి. అంటే మనం ఇన్నాళ్లు మంచి అలవాట్లకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చాం, వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. అయితే న్యాచురోపతి విధానంలో కొన్ని నెలలు మీరు మారి, ఆచరిస్తే చాలు మీరు ఇంత కాలం సాధించలేని ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి అలవాట్లకు మించిన మందులు ఈ ప్రపంచం లో లేవు, ఒక్కసారి ఆలోచించండి.

మనకు మంచి ఆరోగ్యం కావాలంటే, శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి,  అవి (1) మంచి ఆహారం, (2) మంచి నీరు, (3) మంచి గాలి, (4) వ్యాయామం, (5) విసర్జన, (6) విశ్రాంతి, (7) పరిశుభ్రత మరియు (8) మంచి ఆలోచనలు. ఈ ఎనిమిది శరీరానికి అవసరాలు. ఆ అవసరాలు శరీరానికి సరిగ్గా అందించటమే ఆరోగ్యం, శరీరానికి సరిగ్గా అందించక పోవటమే ఆనారోగ్యం. ఈ ఎనిమిది అవసరాలు శరీరానికి సరిగ్గా అందించకుండానే మరియు శరీరానికి సహకరించకుండానే మనం మంచి ఆరోగ్యాన్ని ఆశిస్తున్నాము. రోగనిరోధక శక్తిని కోల్పోతున్నాం అందుచేత వచ్చిన వ్యాధులు పోవడం లేదు, లేని వ్యాధులు రాకుండా ఆగడం లేదు. ఉహించనివిదంగా కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్నే వణికిస్తున్న పరిస్థితులను చూస్తున్నాము, ఈ పరిస్థితిలో వినిపిస్తున్న మాట రోగనిరోధక శక్తి తక్కువ ఉండడం వలన చాలా మంది కరోనా మహమ్మారికి గురవుతున్నారు.

అయితే, శరీరానికి కావలసిన ఈ ఎనిమిది అవసరాలు అందిచడం మన చేతుల్లోనే ఉంది. అయితే ఈ విధానం ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలిసి ఉండకపోవచ్చు. ఏదిఏమైనా, తెలిసో తెలియకనో ఇప్పటివరకు అశ్రద్ధ అయితే చేసాం. అలాంటి అశ్రద్ధ ఇకనుండి చేయకుండా మనం అందరం మంచి ఆరోగ్యాన్ని సంపాదించాలి అంటే, ఈ ఎనిమిది అవసరాలు మన శరీరం కోరుకునే విధంగా అందించే ప్రయత్నం చేస్తే, మంచి రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, ఆరోగ్యం అనేది అడగక్కుండానే వచ్చేస్తుంది. వీటిని పక్కన పెట్టడం అంటేనే మనం అనారోగ్యాన్ని కొనుక్కోవడమే.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంచుకొని, అంటే, ఈ ఎనిమిది అవసరాలు మనం మన శరీరానికి  అందించకుండా వదిలేసి, ఆరోగ్యం కోసం డాక్టర్లను, హాస్పిటల్లను మారుస్తున్నాం, మందులు మారుస్తున్నాం, ఇంకా అవకాశం ఉంటే ఊర్లని మారుస్తూ వేరే ఊర్లకు వెలుతున్నాం. అన్నింటిని మారుస్తున్నాం కానీ మనం మాత్రం మారటం లేదు. అంటే డాక్టర్ కు, హాస్పిటల్ కు పర్మినెంట్ పేషంట్ అయినట్లే, ఈ సంబంధం అలాగే కొనసాగుతూనే ఉంటుంది తప్ప ఆగదు. ఆరోగ్యమనేది ఉంటే ఈ సంబంధాన్ని తగ్గించుకోవచ్చు. వాటి అవసరం రాకుండా జీవించవచ్చు, ఇది కనుక మనం సాధించాలి అనుకుంటే, సాధించలేమా? ఒక్కసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. 

మన శరీరానికి మంచి ఆరోగ్యం కావాలని అందరికి కోరిక ఉన్నది కాబట్టి, దాన్ని సాధించాలి అంటే నా వంతు నేను ఏంచెయ్యాలి, ఆరోగ్యం కోసం నేను ప్రతి రోజు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాను అని, మీకు మీరు కొంచెం మార్పుచేసుకోవడానికి ప్ప్రయత్నం చేయండి, ఎన్ని బెనిఫిట్స్ వస్తాయో ఒక్కసారి అలోచించి చూడండి. మరి ఇలాంటి మంచి అలవాట్లు మనం మార్పు చేసుకుంటే త్వరగా ఆరోగ్యాన్ని పొందడం సాధ్యం అవుతుంది మరియు మంచి రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెంది, ధృడంగా నిలకడగా ఉంటుంది, కరోనా మహమ్మారి వంటి వాటి నుండి కుండా ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. 

మీరు, మీ కుటుంబం, మీ ఇంట్లోనే ఆరోగ్యంగా ఉండే విధంగా, చాలా సింపుల్ గా ఈ న్యాచురోపతి అలవాట్లను అర్థం చేసుకుని, ఆచరించాలని, ఆచరణకు ప్రాముఖ్యం ఇవ్వాలని, అది తప్పకుండా సాధ్యం అవుతుంది అని మరియు అందరు మంచి ఆరోగ్యం పొందాలని, మంచి ఆరోగ్యం అనేది స్వయంగా అనుభవం పొందోచ్చు అని చెబుతూ...

ఈ న్యాచురోపతి విధానాన్ని కొందరు పాటిస్తూ వారు మరియు వారి కుటుంబ సభ్యులు పూర్తి ఆరోగ్యంగా, సుఖంగా మరియు హాయిగా జీవిస్తున్నారు. మరియు అందరికి మంచి ఆరోగ్యం కోసం ఈ న్యాచురోపతి విధానాన్ని వారు వివిధ మాధ్యమాల ద్వారా తెలియచేస్తున్నారు.

కావున, మనమందరం ఈ న్యాచురోపతి అలవాట్లను పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందాలని మరియు కరోనా మహమ్మారి లాంటి వాటి నుండి కూడా రక్షణ పొందాలని ఈ ఆర్టికల్ ద్వారా తెలియచేస్తున్నాము.


The importance of naturopathy in human life:

Post a Comment

0Comments

Post a Comment (0)