సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క మెడిసిన్ కంపోజిషన్:
డైసైక్లోమైన్
హైడ్రోక్లోరైడ్ 20 mg + పారాసెటమాల్ 500 mg
(Dicyclomine Hydrochloride 20 mg + Paracetamol 500 mg)
సైక్లోపామ్
టాబ్లెట్ (Cyclopam Tablet) తయారీదారు కంపెనీ:
Indoco Remedies Ltd
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క ఉపయోగాలు:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) అనేది కడుపు నొప్పి చికిత్స కొరకు ఉపయోగించే ఒక కాంబినేషన్ మెడిసిన్. ఈ కాంబినేషన్ మెడిసిన్ ప్రాథమికంగా పిత్త కోలిక్, ప్రేగు కోలిక్, మూత్రపిండ కోలిక్ మరియు స్పాస్మోడిక్ డిస్మెనోరియా (బాధాకరమైన ఇర్రేగులర్ పీరియడ్-సంబంధిత నొప్పి మరియు తిమ్మిరి) కారణంగా స్పాస్మోడిక్ నొప్పి మరియు అసౌకర్యం చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఈ మెడిసిన్ ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) యొక్క లక్షణాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
డిస్మెనోరియా (పొత్తికడుపు తిమ్మిరి) ఇది ఋతుస్రావం/ పీరియడ్స్ ముందు లేదా సమయంలో సంభవిస్తుంది. సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) కడుపు మరియు గట్ యొక్క కండరాలను సడలించడం ద్వారా కడుపు నొప్పి మరియు తిమ్మిరిని తగ్గించడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ నొప్పి మరియు జ్వరానికి కారణమయ్యే కొన్ని రసాయన దూతలను (కెమికల్ మెసెంజర్స్) కూడా నిరోధిస్తుంది. ఈ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ జీర్ణశయాంతర ప్రేగు పెయిన్ అనాల్జెసిక్స్ చికిత్సా తరగతికి చెందినది.
* సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ వాడటం వలన అలవాటు ఏర్పడటం (Habit Forming): లేదు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క ప్రయోజనాలు:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) అనేది కడుపు నొప్పి చికిత్స కొరకు ఉపయోగించే ఒక కాంబినేషన్ మెడిసిన్. ఈ కాంబినేషన్ మెడిసిన్ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) రెండు మెడిసిన్లతో కూడి ఉంటుంది: డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ మరియు పారాసెటమాల్.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) పిత్తాశయ కోలిక్, ప్రేగు కోలిక్, మూత్రపిండ కోలిక్ మరియు స్పాస్మోడిక్ డిస్మెనోరియా (బాధాకరమైన ఇర్రేగులర్ పీరియడ్-సంబంధిత నొప్పి మరియు తిమ్మిరి) కారణంగా స్పాస్మోడిక్ నొప్పి మరియు అసౌకర్యాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) కడుపు మరియు ప్రేగు (గట్) లో ఆకస్మిక కండరాల నొప్పులు లేదా సంకోచాల నుండి సమర్థవంతంగా ఉపశమనం కలిగిస్తుంది, తద్వారా కండరాలను సడలించి ఆహారం యొక్క కదలికను మెరుగుపరుస్తుంది. ఇది నొప్పి అనుభూతికి కారణమయ్యే మెదడులోని రసాయన దూతలను (కెమికల్ మెసెంజర్స్) కూడా నిరోధిస్తుంది. ఇది కడుపు నొప్పి అలాగే కడుపు తిమ్మిరి, ఉబ్బరం మరియు అసౌకర్యానికి చికిత్స చేయడానికి సహాయపడుతుంది.
ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి ఈ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ని మీ డాక్టరు ద్వారా సూచించినంత కాలం మరియు సూచించిన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి ప్రకారం మిస్ కాకుండా తీసుకోండి. మెడిసిన్ని సూచించిన దానికంటే ఎక్కువ లేదా ఎక్కువ సమయం తీసుకోవద్దు, ఎందుకంటే అది ప్రమాదకరం.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క సైడ్ ఎఫెక్ట్ లు:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క సాధారణ సైడ్ ఎఫెక్ట్ లు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:
- వికారం
- దురద
- దద్దుర్లు
- నిద్రలేమి
- బలహీనత
- మలబద్ధకం
- కళ్లు తిరగడం
- కడుపు ఉబ్బరం
- నీళ్ల విరేచనాలు
- నోటిలో డ్రై కావడం
- దృష్టి మసకబారడం
- వాంతి వచ్చేలా అనిపించడం
వంటి సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు. ఇది సైడ్ ఎఫెక్ట్ ల యొక్క మొత్తం లిస్ట్ కాదు మరియు సైడ్ ఎఫెక్ట్ లు అన్నిసార్లు కలగవు. చాలా సైడ్ ఎఫెక్ట్ లకు వైద్య సహాయం అవసరం లేదు మరియు మీ శరీరం మెడిసిన్ కి సర్దుబాటు కావడంతో సైడ్ ఎఫెక్ట్ లు వాటికవే పోతాయి. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ లు కొనసాగితే లేదా మీరు వాటి గురించి ఆందోళన చెందుతుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క జాగ్రత్తలు:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను ఆహారంతో (ఫుడ్) లేదా ఆహారం (ఫుడ్) లేకుండా తీసుకోవచ్చు. టాబ్లెట్ మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి మీరు మెడిసిన్ ను దేనికి ఉపయోగిస్తున్నారు మరియు మీ లక్షణాలకు ఎంతవరకు బాగా ఈ మెడిసిన్ సహాయపడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది, అందుకు అనుగుణంగా మీ డాక్టర్ మెడిసిన్ మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి సూచిస్తారు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను మీ డాక్టర్ సూచించిన విధంగా ఉపయోగించండి లేదా ఉపయోగించడానికి ముందు డైరెక్షన్ ల కొరకు లేబుల్ని చెక్ చేయండి. మీ డాక్టర్ ద్వారా సూచించబడిన ఖచ్చితమైన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధిలో ఈ మెడిసిన్ని ఉపయోగించండి. సూచించబడిన మోతాదు (డోస్) మొత్తం కంటే ఎక్కువగా ఉపయోగించవద్దు, ఎక్కువ మోతాదు (డోస్) తీసుకోవడం వల్ల మీ లక్షణాలు తగ్గకపోగా, ఇది విషప్రయోగం కావచ్చు లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లను కలిగించవచ్చు.
మీకు సైడ్ ఎఫెక్ట్ లలో ఏవైనా కలిగితే మరియు వాటికవే తగ్గకపోతే లేదా అధ్వాన్నంగా ఉంటే, మీరు మీ డాక్టర్ కి తెలియజేయాలి. మీ డాక్టర్ సైడ్ ఎఫెక్ట్ లను నివారించడానికి లేదా తగ్గించడానికి మార్గాలను సూచిస్తారు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ను తీసుకునే ముందు, మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులున్నట్లయితే అంటే, ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే, ఫుడ్ లేదా మెడిసిన్ అలెర్జీలు, లేదా ముందుగా ఉన్న వ్యాధులు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు మరియు మీరు ఏదైనా ఇతర మెడిసిన్లను ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాలను మెడిసిన్ తీసుకునే ముందు ఎల్లప్పుడూ మీ డాక్టర్ కి తెలియజేయండి.
* సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ఉపయోగించినప్పుడు మైకము, మగత లేదా దృష్టి అంతరాయాలకు కారణం కావచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా ఏకాగ్రత అవసరమయ్యే ఏదైనా పని చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
* ఈ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ తీసుకునేటప్పుడు మద్యం సేవించడం మానుకోండి, ఎందుకంటే ఇది అధిక మగతకు కారణమవుతుంది, కడుపు సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు మద్యం తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లు మరింత తీవ్రమవుతాయి (ఇందులో పారాసెటమాల్ ఉంటుంది, ఇది మీ కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది). అందువల్ల సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ఉపయోగిస్తున్నప్పుడు మద్యం తీసుకోవడం మానుకోవాలని సలహా ఇవ్వబడుతోంది.
* మొదట మీ వైద్యుడిని అడగకుండా పారాసిటమాల్ (నొప్పి/జ్వరం లేదా దగ్గు-జలుబు కొరకు మందులు) కలిగిన మరే ఇతర మెడిసిన్ తో సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ తీసుకోవద్దు.
* సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ను పిల్లలలో డాక్టర్ సూచించినప్పుడు మాత్రమే ఉపయోగించాలి.
* మెడిసిన్ తీసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితులు ఎల్లప్పుడూ మీ డాక్టర్ కి తెలియజేయండి. ఎందుకంటే, కొన్ని ఆరోగ్య పరిస్థితులు మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు లోనయ్యేలా చేస్తాయి, అది ప్రమాదకరం.
* మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను ఎలా ఉపయోగించాలి:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ని మీ డాక్టర్ సూచించిన విధంగా ఉపయోగించండి లేదా ఉపయోగించడానికి ముందు డైరెక్షన్ల కొరకు లేబుల్ని చెక్ చేయండి. సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ని ఆహారంతో (ఫుడ్) లేదా ఆహారం (ఫుడ్) లేకుండా తీసుకోవచ్చు. (సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను ఆహారం (ఫుడ్) తీసుకున్న తర్వాత తీసుకోవడం ఉత్తమం, ఎందుకంటే ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు మెడిసిన్ కలిగించే గ్యాస్ట్రిక్ చికాకును నివారించడానికి ఆహారం (ఫుడ్) సహాయపడుతుంది).
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను గ్లాసు వాటర్ తో మొత్తంగా మింగండి. టాబ్లెట్ ను నమలడం, చూర్ణం చేయడం లేదా పగలగొట్టి తీసుకోవడం వంటివి చేయవద్దు. మీ డాక్టర్ ద్వారా సూచించబడిన ఖచ్చితమైన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధిలో ఈ మెడిసిన్ని ఉపయోగించండి.
మీకు లక్షణాలు తగ్గిపోయి మంచిగా అనిపించినా కూడా మెడిసిన్ యొక్క ఎలాంటి మోతాదు (డోస్) లను విడిచిపెట్టవద్దు మరియు మీ డాక్టర్ ద్వారా సూచించబడిన చికిత్స యొక్క మెడిసిన్ పూర్తి కోర్సును పూర్తి చేయండి. సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ని తీసుకోవడం ముందుగానే ఆపడం వల్ల మీకు లక్షణాలు తిరిగి రావచ్చు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ని సూచించబడిన మోతాదు (డోస్) మొత్తం కంటే ఎక్కువగా ఉపయోగించవద్దు, ఎక్కువ మోతాదు (డోస్) తీసుకోవడం వల్ల మీ లక్షణాలు తగ్గకపోగా, ఇది విషప్రయోగం కావచ్చు లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లను కలిగించవచ్చు.
* మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ఎలా పనిచేస్తుంది:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) అనేది రెండు మెడిసిన్ల కాంబినేషన్ మెడిసిన్: సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) లో డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ మరియు పారాసెటమాల్ అనే రెండు మెడిసిన్లు ఉంటాయి. కడుపు నొప్పి మరియు తిమ్మిరికి కారణమయ్యే రసాయన దూతల (కెమికల్ మెసెంజర్స్) చర్యను నిరోధించడం ద్వారా ఈ సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ పనిచేస్తుంది.
డైసైక్లోమైన్ హైడ్రోక్లోరైడ్ యాంటీ కోలినెర్జిక్, ఇది కడుపు మరియు సహజ గట్ (ప్రేగు) లోని కండరాలను సడలిస్తుంది. ఇది ఆకస్మిక కండరాల సంకోచాలను (దుస్సంకోచాలు) ఆపివేస్తుంది, తద్వారా కడుపు మరియు ప్రేగులలో కండరాల నొప్పులు మరియు తిమ్మిరి, నొప్పి, ఉబ్బరం మరియు జీర్ణశయాంతర ప్రేగు అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది. పారాసెటమాల్ ఒక అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) ఇది నొప్పిని కలిగించే కొన్ని రసాయన దూతల (కెమికల్ మెసెంజర్స్) విడుదలను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మోతాదు (డోస్) మిస్ అయితే:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్, ఒక మోతాదు (డోస్) మిస్ అయితే, వెంటనే గమనించి మెడిసిన్ తీసుకోండి. ఒకవేళ ఈ మెడిసిన్ తదుపరి మోతాదు (డోస్) తీసుకోవలసిన సమయానికి దగ్గరగా ఉంటే, మిస్ అయిన మోతాదు (డోస్) ను తీసుకోకుండా, మీ సాధారణ మోతాదు (డోస్) తీసుకునే సమయానికి తీసుకోండి. మెడిసిన్ మోతాదు (డోస్) మిస్ అయితే డబుల్ డోస్ మాత్రం తీసుకోవద్దు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) ను నిల్వ చేయడం:
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ను కాంతి, వేడి మరియు తేమ నుండి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. బాత్రూమ్ వంటి ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు. అన్ని మెడిసిన్లను పిల్లలు (చిల్డ్రన్) మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచండి, మరియు మెడిసిన్ లను కలుషితం కాకుండా నిల్వ చేయండి.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క పరస్పర చర్యలు:
ఇతర మెడిసిన్లతో సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్):
- Cholestyramine (అధిక కొలెస్ట్రాల్-తగ్గించే
మెడిసిన్)
- Warfarin (రక్తం పలుచబడటానికి ఉపయోగించే
మెడిసిన్)
- Rifampicin (TB (క్షయవ్యాధి) చికిత్సకు
ఉపయోగించే మెడిసిన్)
- Methotrexate (యాంటీ క్యాన్సర్ లేదా
యాంటీ ఆర్థరైటిస్ మెడిసిన్)
- Zidovudine (HIV సోకిన రోగుల చికిత్సకు
ఉపయోగించే మెడిసిన్)
- Tacrolimus (అవయవ తిరస్కరణను తగ్గించే
చికిత్సకు ఉపయోగించే మెడిసిన్)
- Domperidone, Metochlopramide (వాంతులు,
వికారం ఆపడానికి ఉపయోగించే మెడిసిన్లు)
- Flucloxacillin (చర్మం, డయాబెటిక్
పాదాల గాయం, ఎముక ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే మెడిసిన్)
- Potassium Citrate and
(Potassium Supplements) (కిడ్నీ స్టోన్ పరిస్థితికి చికిత్స చేయడానికి ఉపయోగించే
మెడిసిన్)
- Phenobarbital, Phenytoin, Carbamazepine, Topiramate (మూర్ఛలను నిరోధించడం మరియు నియంత్రించడం చికిత్సకు ఉపయోగించే మెడిసిన్లు) వంటి మెడిసిన్ల తో సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్) చెందవచ్చు. ఈ లిస్ట్ మొత్తం కాదు. ఇతర మెడిసిన్లతో కూడా పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్) చెందవచ్చు.
సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) యొక్క సేఫ్టీ సలహాలు:
ప్రెగ్నెన్సీ
(గర్భం): దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. స్త్రీలలో గర్భధారణ సమయంలో సైక్లోపామ్
టాబ్లెట్ (Cyclopam Tablet) ఉపయోగించడం పిండానికి ప్రమాదం కంటే, ప్రయోజనం ఉంటే మీ డాక్టర్ ద్వారా సూచించబడితే,
సాధారణంగా గర్భధారణ సమయంలో ఉపయోగించడం సురక్షితంగా పరిగణించబడుతుంది.
తల్లిపాలు:
దయచేసి
మీ డాక్టర్ ని సంప్రదించండి. మీరు తల్లి పాలిచ్చే సమయంలో సైక్లోపామ్ టాబ్లెట్
(Cyclopam Tablet) ను ఉపయోగించడం బహుశా సురక్షితం కాదు. ఈ మెడిసిన్ మీ డాక్టర్ ని సంప్రదించకుండా
తీసుకోకూడదు. దీనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
కిడ్నీలు:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. మూత్రపిండాల (కిడ్నీల) వ్యాధి ఉన్న రోగులలో సైక్లోపామ్
టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ను జాగ్రత్తగా వాడాలి. మీ డాక్టర్ ద్వారా ఈ మెడిసిన్
మోతాదు (డోస్) సర్దుబాటు చేయాల్సిన అవసరం కావచ్చు. అయినప్పటికీ, దీనికి సంబంధించి ఏవైనా
ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
లివర్:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. కాలేయము (లివర్) వ్యాధి ఉన్న రోగులలో సైక్లోపామ్
టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్ ను జాగ్రత్తగా వాడాలి. మీ డాక్టర్ ద్వారా ఈ మెడిసిన్
మోతాదు (డోస్) సర్దుబాటు చేయాల్సిన అవసరం కావచ్చు. అయినప్పటికీ, దీనికి సంబంధించి ఏవైనా
ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
మద్యం
(ఆల్కహాల్): దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. సైక్లోపామ్
టాబ్లెట్ (Cyclopam Tablet) తో పాటుగా మద్యం సేవించడం సురక్షితం కాదు. ఎందుకంటే, ఇది
అధిక మగతకు కారణమవుతుంది, కడుపు సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది మరియు మద్యం తాగడం వల్ల
సైడ్ ఎఫెక్ట్ లు మరింత తీవ్రమవుతాయి (ఇందులో పారాసెటమాల్ ఉంటుంది, ఇది మీ కాలేయాన్ని
తీవ్రంగా దెబ్బతీస్తుంది). సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) తో పాటు మద్యం సేవించవద్దని
మీకు సిఫారసు చేయబడుతోంది, దీనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్
ని సంప్రదించండి.
డ్రైవింగ్:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam Tablet) మెడిసిన్
మీ అప్రమత్తత, ఏకాగ్రతను తగ్గించవచ్చు, మీ దృష్టిని ప్రభావితం చేయవచ్చు లేదా మీకు నిద్ర
మరియు మైకము అనిపించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే డ్రైవ్ చేయవద్దు.
గమనిక: Telugu GMP వెబ్‌సైట్ అందించిన
ఈ సమాచారం కేవలం అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. సైక్లోపామ్ టాబ్లెట్ (Cyclopam
Tablet) మెడిసిన్ యొక్క పూర్తి సమాచారం కాదు. ఈ మెడిసిన్ యొక్క పూర్తి వివరాల కోసం
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. ఈ వెబ్‌సైట్ లో మీరు చదివిన సమాచారం కారణంగా మీ
ప్రొఫెషనల్ డాక్టర్ వైద్య సలహాను విస్మరించవద్దు.