జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క మెడిసిన్ కంపోజిషన్:
ఎసిక్లోఫెనాక్
100 mg + పారాసెటమాల్ 325 mg
(Aceclofenac 100 mg + Paracetamol 325 mg)
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) తయారీదారు కంపెనీ:
Ipca
Laboratories Ltd
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క ఉపయోగాలు:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) నొప్పి నివారణ మెడిసిన్. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ప్రధానంగా నొప్పి మరియు మంటను తగ్గించడానికి ఉపయోగిస్తారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ళ యొక్క బాధాకరమైన నొప్పి మరియు వాపు), యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ (మెడ, భుజాలు, తుంటి మరియు మోకాళ్ళు మరియు వెన్నెముక మరియు పక్కటెముకల మధ్య నొప్పి) మరియు ఆస్టియో ఆర్థరైటిస్ (చేతులు, తుంటి, మోకాలి, దిగువ వీపు లేదా మెడ, కీళ్ళలో ఎముకల చివరల నొప్పి) వంటి పరిస్థితులలో నొప్పి, మంట మరియు వాపు తగ్గించడానికి ఈ మెడిసిన్ ఉపయోగించబడుతుంది.
కండరాల నొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పి లేదా చెవి మరియు గొంతులో నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది ఎసిక్లోఫెనాక్ మరియు పారాసెటమాల్ మెడిసిన్ల తో కూడి ఉంటుంది. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) 'నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్' (NSAID) అని పిలువబడే మెడిసిన్ల సమూహానికి చెందినది మరియు పెయిన్ అనాల్జెసిక్స్ యొక్క చికిత్సా తరగతికి చెందినవి.
* జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ వాడటం వలన అలవాటు ఏర్పడటం (Habit Forming): లేదు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క ప్రయోజనాలు:
కీళ్ళు, కండరాలు మరియు వివిధ సమస్యలను ప్రభావితం చేసే పరిస్థితులలో నొప్పి, మంట మరియు వాపు యొక్క స్వల్పకాలిక ఉపశమనం కోసం జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ఉపయోగిస్తారు. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను ఉపయోగించే కొన్ని పరిస్థితులు రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, కండరాల నొప్పి, వెన్నునొప్పి, పంటి నొప్పి లేదా చెవి మరియు గొంతు నొప్పి.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ఎక్కువ గంటలు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో గణనీయంగా పనిచేస్తుంది. ఇందులో పారాసిటమాల్ ఉంటుంది, ఇది ఇతర పెయిన్ కిల్లర్ల కంటే కడుపుకు తక్కువ చికాకు కలిగిస్తుంది. అందువల్ల, గ్యాస్ట్రో రక్తస్రావం (గ్యాస్ట్రో బ్లీడింగ్) లేదా అల్సర్ ఏర్పడే ప్రమాదం ఉన్న రోగులు దీనిని బాగా తట్టుకోగలరు. అంతేకాకుండా, ఇది రక్తస్రావం (బ్లీడింగ్) సమయాన్ని ప్రభావితం చేయదు మరియు నొప్పి లేదా వాపు కారణంగా జ్వరాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఎక్కువ ప్రయోజనాన్ని పొందడానికి ఈ జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ని మీ డాక్టరు ద్వారా సూచించినంత కాలం మరియు సూచించిన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి ప్రకారం మిస్ కాకుండా తీసుకోండి. మెడిసిన్ని సూచించిన దానికంటే ఎక్కువ లేదా ఎక్కువ సమయం తీసుకోవద్దు, ఎందుకంటే అది ప్రమాదకరం.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క సైడ్ ఎఫెక్ట్ లు:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క సాధారణ సైడ్ ఎఫెక్ట్ లు ఈ క్రింది విధంగా ఉండవచ్చు:
- వికారం
- వాంతులు
- అతిసారం
- మలబద్ధకం
- కడుపు నొప్పి
- తలతిరగడం
- గుండెల్లో మంట
- ఆకలి లేకపోవడం
వంటి సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు. ఇది సైడ్ ఎఫెక్ట్ ల యొక్క మొత్తం లిస్ట్ కాదు మరియు సైడ్ ఎఫెక్ట్ లు అన్నిసార్లు కలగవు. చాలా సైడ్ ఎఫెక్ట్ లకు వైద్య సహాయం అవసరం లేదు మరియు మీ శరీరం మెడిసిన్ కి సర్దుబాటు కావడంతో సైడ్ ఎఫెక్ట్ లు వాటికవే పోతాయి. ఒకవేళ సైడ్ ఎఫెక్ట్ లు కొనసాగితే లేదా మీరు వాటి గురించి ఆందోళన చెందుతుంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క జాగ్రత్తలు:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను ఆహారంతో (ఫుడ్) లేదా ఆహారం (ఫుడ్) లేకుండా తీసుకోవచ్చు. టాబ్లెట్ మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి మీరు మెడిసిన్ ను దేనికి ఉపయోగిస్తున్నారు మరియు మీ లక్షణాలకు ఎంతవరకు బాగా ఈ మెడిసిన్ సహాయపడుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది, అందుకు అనుగుణంగా మీ డాక్టర్ మెడిసిన్ మోతాదు (డోస్) మరియు కాలవ్యవధి సూచిస్తారు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను మీ డాక్టర్ సూచించిన విధంగా ఉపయోగించండి లేదా ఉపయోగించడానికి ముందు డైరెక్షన్ ల కొరకు లేబుల్ని చెక్ చేయండి. మీ డాక్టర్ ద్వారా సూచించబడిన ఖచ్చితమైన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధిలో ఈ మెడిసిన్ని ఉపయోగించండి. సూచించబడిన మోతాదు (డోస్) మొత్తం కంటే ఎక్కువగా ఉపయోగించవద్దు, ఎక్కువ మోతాదు (డోస్) తీసుకోవడం వల్ల మీ లక్షణాలు తగ్గకపోగా, ఇది విషప్రయోగం కావచ్చు లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లను కలిగించవచ్చు.
మీకు సైడ్ ఎఫెక్ట్ లలో ఏవైనా కలిగితే మరియు వాటికవే తగ్గకపోతే లేదా అధ్వాన్నంగా ఉంటే, మీరు మీ డాక్టర్ కి తెలియజేయాలి. మీ డాక్టర్ సైడ్ ఎఫెక్ట్ లను నివారించడానికి లేదా తగ్గించడానికి మార్గాలను సూచిస్తారు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ ను తీసుకునే ముందు, మీకు ఏవైనా ఆరోగ్య పరిస్థితులున్నట్లయితే అంటే, ఒకవేళ మీరు గర్భవతిగా ఉన్నట్లయితే, తల్లిపాలు ఇస్తున్నట్లయితే, ఫుడ్ లేదా మెడిసిన్ అలెర్జీలు, లేదా ముందుగా ఉన్న వ్యాధులు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు మరియు మీరు ఏదైనా ఇతర మెడిసిన్లను ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాలను మెడిసిన్ తీసుకునే ముందు ఎల్లప్పుడూ మీ డాక్టర్ కి తెలియజేయండి.
* జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క రోజువారీ సూచించబడిన మోతాదు (డోస్) కంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినవచ్చు లేదా నోరు, ముఖం, గొంతు వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మపు దద్దుర్లు లేదా దురద వంటి అలెర్జీ ప్రతిచర్యలు ఉండవచ్చు. కాలేయ గాయం యొక్క చాలా కేసులు పారాసిటమాల్ వాడకంతో సంబంధం కలిగి ఉంటాయి. జీర్ణాశయాంతర రక్తస్రావం, అల్సర్ ఏర్పడటం సాధారణంగా జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) తో గమనించబడుతుంది, కాబట్టి డాక్టర్ మీకు అందుబాటులో ఉన్న అతి తక్కువ మోతాదు (డోస్) ను సూచించవచ్చు.
* మీకు ఉబ్బసం (ఆస్తమా) లేదా నొప్పి నివారణలు, గుండె, మూత్రపిండాలు మరియు కాలేయ పరిస్థితులకు అలెర్జీలు ఉంటే జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) తీసుకోవద్దు.
* జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను గర్భధారణ సమయంలో లేదా తల్లి పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది శిశువుపై ప్రభావం చూపుతుంది.
* మెడిసిన్ తీసుకునే ముందు మీ ఆరోగ్య పరిస్థితులు ఎల్లప్పుడూ మీ డాక్టర్ కి తెలియజేయండి. ఎందుకంటే, కొన్ని ఆరోగ్య పరిస్థితులు మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు లోనయ్యేలా చేస్తాయి, అది ప్రమాదకరం.
* మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను ఎలా ఉపయోగించాలి:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ని మీ డాక్టర్ సూచించిన విధంగా ఉపయోగించండి లేదా ఉపయోగించడానికి ముందు డైరెక్షన్ల కొరకు లేబుల్ని చెక్ చేయండి. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ని ఆహారంతో (ఫుడ్) లేదా ఆహారం (ఫుడ్) లేకుండా తీసుకోవచ్చు. (జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను ఆహారం (ఫుడ్) తీసుకున్న తర్వాత తీసుకోవడం ఉత్తమం, ఎందుకంటే ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు మెడిసిన్ కలిగించే గ్యాస్ట్రిక్ చికాకును నివారించడానికి ఆహారం (ఫుడ్) సహాయపడుతుంది).
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను గ్లాసు వాటర్ తో మొత్తంగా మింగండి. టాబ్లెట్ ను నమలడం, చూర్ణం చేయడం లేదా పగలగొట్టి తీసుకోవడం వంటివి చేయవద్దు. మీ డాక్టర్ ద్వారా సూచించబడిన ఖచ్చితమైన మోతాదు (డోస్) మరియు కాలవ్యవధిలో ఈ మెడిసిన్ని ఉపయోగించండి.
మీకు లక్షణాలు తగ్గిపోయి మంచిగా అనిపించినా కూడా మెడిసిన్ యొక్క ఎలాంటి మోతాదు (డోస్) లను విడిచిపెట్టవద్దు మరియు చికిత్స యొక్క పూర్తి కోర్సును పూర్తి చేయండి. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ని తీసుకోవడం ముందుగానే ఆపడం వల్ల మీకు లక్షణాలు తిరిగి రావచ్చు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ని సూచించబడిన మోతాదు (డోస్) మొత్తం కంటే ఎక్కువగా ఉపయోగించవద్దు, ఎక్కువ మోతాదు (డోస్) తీసుకోవడం వల్ల మీ లక్షణాలు తగ్గకపోగా, ఇది విషప్రయోగం కావచ్చు లేదా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లను కలిగించవచ్చు.
* మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ఎలా పనిచేస్తుంది:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) అనేది రెండు మెడిసిన్ల కాంబినేషన్ మెడిసిన్: జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) లో ఎసిక్లోఫెనాక్ మరియు పారాసెటమాల్ అనే రెండు మెడిసిన్లు ఉంటాయి. నొప్పి, జ్వరం మరియు మంట (ఎరుపు మరియు వాపు) కు కారణమయ్యే రసాయన దూతల (కెమికల్ మెసెంజర్స్) చర్యను నిరోధించడం ద్వారా ఈ జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ పనిచేస్తుంది.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మోతాదు (డోస్) మిస్ అయితే:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్, ఒక మోతాదు (డోస్) మిస్ అయితే, వెంటనే గమనించి మెడిసిన్ తీసుకోండి. ఒకవేళ ఈ మెడిసిన్ తదుపరి మోతాదు (డోస్) తీసుకోవలసిన సమయానికి దగ్గరగా ఉంటే, మిస్ అయిన మోతాదు (డోస్) ను తీసుకోకుండా, మీ సాధారణ మోతాదు (డోస్) తీసుకునే సమయానికి తీసుకోండి. మెడిసిన్ మోతాదు (డోస్) మిస్ అయితే డబుల్ డోస్ మాత్రం తీసుకోవద్దు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను నిల్వ చేయడం:
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ ను కాంతి, వేడి మరియు తేమ నుండి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. బాత్రూమ్ వంటి ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు. అన్ని మెడిసిన్లను పిల్లలు (చిల్డ్రన్) మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచండి, మరియు మెడిసిన్ లను కలుషితం కాకుండా నిల్వ చేయండి.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క పరస్పర చర్యలు:
ఇతర మెడిసిన్లతో జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్):
- Lithium (డిప్రెషన్ చికిత్సకు
ఉపయోగించే మెడిసిన్)
- Cholestyramine (అధిక
కొలెస్ట్రాల్-తగ్గించే మెడిసిన్)
- Warfarin (రక్తం పలుచబడటానికి
ఉపయోగించే మెడిసిన్)
- Mifepristone (గర్భస్రావం కొరకు
ఉపయోగించే మెడిసిన్)
- Methotrexate (యాంటీ క్యాన్సర్
లేదా యాంటీ ఆర్థరైటిస్ మెడిసిన్)
- Zidovudine (HIV సోకిన రోగుల
చికిత్సకు ఉపయోగించే మెడిసిన్)
- Tacrolimus (అవయవ తిరస్కరణను తగ్గించే చికిత్సకు ఉపయోగించే మెడిసిన్)
- Domperidone, Metochlopramide
(వాంతులు, వికారం ఆపడానికి ఉపయోగించే మెడిసిన్లు)
- Chloramphenicol (తీవ్రమైన
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించే మెడిసిన్)
- Glipizide, Glyburide (అధిక
రక్తంలో చక్కెర (డయాబెటిక్) చికిత్సకు ఉపయోగించే మెడిసిన్లు)
- Cyclosporine (అవయవ మార్పిడి తర్వాత అవయవ తిరస్కరణను నివారించడానికి ఉపయోగించే మెడిసిన్) వంటి మెడిసిన్ల తో జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్) చెందవచ్చు. ఈ లిస్ట్ మొత్తం కాదు. ఇతర మెడిసిన్లతో కూడా పరస్పర చర్యలు (ఇంటరాక్షన్స్) చెందవచ్చు.
జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) యొక్క సేఫ్టీ సలహాలు:
ప్రెగ్నెన్సీ
(గర్భం): దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. స్త్రీలలో గర్భధారణ సమయంలో జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) ఉపయోగించడం సురక్షితం కాదు. అందువల్ల, మీ డాక్టర్ ద్వారా అత్యవసరమైనదిగా పరిగణించబడకపోతే గర్భధారణ సమయంలో ఉపయోగించడానికి జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) సిఫారసు చేయబడదు.
తల్లిపాలు:
దయచేసి
మీ డాక్టర్ ని సంప్రదించండి. మీరు తల్లి పాలిచ్చే సమయంలో జీరోడాల్ పి టాబ్లెట్
(Zerodol P Tablet) ను మీ డాక్టర్ ని సంప్రదించకుండా తీసుకోకూడదు. ఈ మెడిసిన్ తల్లి
పాలలోకి వెళుతుందో లేదో తెలియదు. మీ డాక్టర్ ద్వారా అత్యవసరమైనదిగా పరిగణించబడితే తప్ప
తల్లి పాలిచ్చే సమయంలో ఉపయోగించడానికి ఈ మెడిసిన్ సిఫారసు చేయబడదు. దీనికి సంబంధించి
ఏవైనా ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
కిడ్నీలు:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. మూత్రపిండాల (కిడ్నీల) వ్యాధి ఉన్న రోగులలో జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ ను జాగ్రత్తగా వాడాలి. మీ డాక్టర్ ద్వారా
ఈ మెడిసిన్ మోతాదు (డోస్) సర్దుబాటు చేయాల్సిన అవసరం కావచ్చు. అయినప్పటికీ, తీవ్రమైన
మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులలో జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) వాడకం సిఫారసు
చేయబడదు. దీనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
లివర్:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. కాలేయము (లివర్) వ్యాధి ఉన్న రోగులలో జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్ ను జాగ్రత్తగా వాడాలి. మీ డాక్టర్ ద్వారా
ఈ మెడిసిన్ మోతాదు (డోస్) సర్దుబాటు చేయాల్సిన అవసరం కావచ్చు. అయినప్పటికీ, జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) ను తీవ్రమైన కాలేయ వ్యాధి మరియు క్రియాశీల (ఆక్టివ్)
కాలేయ వ్యాధి ఉన్న రోగులలో సిఫారసు చేయబడదు. దీనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
మద్యం
(ఆల్కహాల్): దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) తో పాటుగా మద్యం సేవించడం సురక్షితం కాదు. జీరోడాల్
పి టాబ్లెట్ (Zerodol P Tablet) తో పాటు మద్యం సేవించవద్దని మీకు సిఫారసు చేయబడుతోంది,
ఎందుకంటే ఇందులో పారాసెటమాల్ ఉంటుంది, ఇది మీ కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది.
దీనికి సంబంధించి ఏవైనా ఆందోళనలు ఉంటే దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి.
డ్రైవింగ్:
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P Tablet) మెడిసిన్
మీ అప్రమత్తతను తగ్గించవచ్చు, మీ దృష్టిని ప్రభావితం చేయవచ్చు లేదా మీకు నిద్ర మరియు
మైకము అనిపించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే డ్రైవ్ చేయవద్దు.
గమనిక: Telugu GMP వెబ్‌సైట్ అందించిన
ఈ సమాచారం కేవలం అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. జీరోడాల్ పి టాబ్లెట్ (Zerodol P
Tablet) మెడిసిన్ యొక్క పూర్తి సమాచారం కాదు. ఈ మెడిసిన్ యొక్క పూర్తి వివరాల కోసం
దయచేసి మీ డాక్టర్ ని సంప్రదించండి. ఈ వెబ్‌సైట్ లో మీరు చదివిన సమాచారం కారణంగా మీ
ప్రొఫెషనల్ డాక్టర్ వైద్య సలహాను విస్మరించవద్దు.