TGA GMP GUIDELINES PART-2 IN TELUGU
Qualification in Telugu:
➤ Process Validation Activities ప్రారంభించే ముందు, క్రిటికల్ ఎక్విప్మెంట్ (Critical Equipment) మరియు సహాయక వ్యవస్థల (Ancillary Systems) యొక్క తగిన అర్హతను (Qualification) పూర్తి చేయాలి. అర్హతను (Qualification) సాధారణంగా కింది కార్యకలాపాలను వ్యక్తిగతంగా లేదా కలిపి (Individually or Combined) నిర్వహించడం ద్వారా అర్హతను (Qualification) నిర్ణయించటం జరుగుతుంది.
- Design Qualification (DQ): సౌకర్యాలు (Facilities), పరికరాలు (Equipment's) లేదా వ్యవస్థల (Systems) యొక్క ప్రతిపాదిత రూపకల్పన (Proposed Design) ఉద్దేశించిన ప్రయోజనం కోసం అనుకూలంగా ఉందని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి.
- Installation Qualification (IQ): పరికరాలు లేదా వ్యవస్థలు (Equipment's or Systems), ఇన్‌స్టాల్ చేయబడిన లేదా సవరించినట్లుగా (Modified), ఆమోదించబడిన డిజైన్ (Approved Design) తయారీదారు యొక్క సిఫార్సులు మరియు / లేదా వినియోగదారు అవసరాలకు ఆమోదం పొందిన డిజైన్‌కు అనుగుణంగా ఉన్నాయని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి.
- Operational Qualification (OQ): పరికరాలు లేదా వ్యవస్థలు (Equipment's or Systems) ఇన్‌స్టాల్ చేయబడినవి లేదా సవరించబడినవి (Modified) ముందుగా గ్రహించిన ఆపరేటింగ్ పరిధిలో ఉద్దేశించిన (Intended) విధంగా పనిచేస్తాయని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి.
- Performance Qualification (PQ): పరికరాలు (Equipment's) మరియు సహాయక వ్యవస్థలు (Ancillary Systems) కలిసి అనుసంధానించబడినట్లుగా ఆమోదించబడిన ప్రాసెస్ పద్ధతి (Approved Process Method) మరియు స్పెసిఫికేషన్ల ఆధారంగా సమర్థవంతంగా (Effectively) మరియు పునరుత్పత్తి (Reproducibly) చేయగలవని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి.
Qualification in Telugu