వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి?
వ్యాక్సిన్లు (Vaccines) లేకుండా కొన్ని రకాల వ్యాధుల నుండి రక్షణ పొందలేము, ఉదాహరణకు: తట్టు వ్యాధి (Measles), మెదడు యొక్క పొరల వాపు వ్యాధి (Meningitis), ఊపిరితిత్తుల వాపు వ్యాధి (Pneumonia), ధనుర్వాతం (Tetanus) మరియు పోలియో (Polio) వంటి వ్యాధుల నుండి తీవ్రమైన అనారోగ్యం (Serious illness) మరియు వైకల్యం (Disability) వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులు చాలా ప్రాణాంతకం (Life threatening) కావచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు (Vaccines) ప్రతి సంవత్సరం 2 నుండి 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రాణాలను కాపాడుతున్నాయి అని అంచనా.
కొన్ని వ్యాధులు (Diseases) అసాధారణంగా మారినప్పటికీ, వాటికి కారణమయ్యే సూక్ష్మక్రిములు (Germs) ప్రపంచంలోని కొన్ని లేదా అన్ని ప్రాంతాలలో వ్యాప్తి (Spread) చెందుతూనే ఉన్నాయి. నేటి ప్రపంచంలో, అంటు వ్యాధులు (Infectious diseases) దేశాల సరిహద్దులను సులభంగా దాటుతున్నాయి మరియు రక్షించబడని (Not protected) వారికీ ఎవరికైనా సోకుతాయి (Infect) మరియు సోకుతున్నాయి, ఉదాహరణకి: 2020 సంవత్సరంలో కోవిడ్ - 19 (కరోనావైరస్) అంటు వ్యాధి మహమ్మారిగా (Pandemic) మారి ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తి చెంది కొన్ని కోట్ల మంది ప్రజలకు సోకింది, మరియు 40 లక్షలకు పైగా ప్రజల ప్రాణాలు బలితీసుకుంది. (కోవిడ్ - 19 (కరోనావైరస్) మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది).
వ్యాక్సిన్లు (Vaccines) వేయడానికి రెండు ప్రధాన కారణాలు, మనల్ని మనం రక్షించుకోవడానికి (To protect ourselves) మరియు మన చుట్టూ ఉన్న వారిని రక్షించడం కొరకు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు (Vaccines) వేయడం సాధ్యం కాదు ఎందుకంటే చాలా చిన్న పిల్లలు (Very young children), తీవ్రమైన అనారోగ్యం (Serious illness) లేదా కొన్ని అలెర్జీలు (Certain allergies) ఉన్నవారికి వ్యాక్సిన్లు (Vaccines) వేయడం కుదరదు, ఇలాంటి వారు వ్యాక్సిన్ నివారించగల వ్యాధుల నుండి కూడా వారు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇతరులకు వ్యాక్సిన్లు (Vaccines) వేయడంపై ఆధారపడతారు, అంటే వారి చుట్టూ ఉన్న వారికి వ్యాక్సిన్లు (Vaccines) వేయడం వలన వ్యాక్సిన్ తీసుకోని వీరు రక్షించబడుతారు (Protected) మరియు సురక్షితంగా (Safe) ఉంటారు. అందువలన వ్యాక్సిన్లు తీసుకోవాలి మరియు సాధ్యమైనంతవరకు అందరికి వ్యాక్సిన్లు వేయాలి.
ప్రస్తుతం కోవిడ్ - 19 (కరోనావైరస్) మహమ్మారి (Pandemic) తీవ్రమైన ప్రాణాంతకమైన అంటు వ్యాధి (Severe malignant infection) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అందరికి తప్పకుండా కోవిడ్ - 19 కరోనావైరస్ వ్యాక్సిన్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Why should get vaccinated? in Telugu: