టైఫాయిడ్ జ్వరం అంటే ఏమిటి? | What is typhoid fever? in Telugu

TELUGU GMP
0
టైఫాయిడ్ జ్వరం అంటే ఏమిటి? | What is typhoid fever? in Telugu

టైఫాయిడ్ జ్వరం అంటే ఏమిటి?

టైఫాయిడ్ జ్వరం (Typhoid fever) అనేది సాల్మొనెల్లా ఎంటెరికా సెరోవర్ టైఫి (Salmonella enterica serovar Typhi - సాధారణంగా సాల్మోనెల్లా టైఫి అని పిలుస్తారు) అనే బాక్టీరియా వల్ల కలిగే ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ (Life threatening infection).

టైఫాయిడ్ జ్వరం (Typhoid fever) సాధారణంగా, వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం (Poor personal and environmental hygiene) వలన ఆహారం కలుషితం (Food contamination) అవడం వలన లేదా/మరియు నీరు కలుషితం (Water contamination) అవడం వలన వ్యాప్తి చెందుతుంది.

ఈ కారణంగా ప్రతి సంవత్సరం, టైఫాయిడ్ వలన 11 నుండి 21 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు మరియు ప్రపంచవ్యాప్తంగా 128000 నుండి 161000 మంది ప్రజలు మరణిస్తున్నారు.

సాల్మోనెల్లా టైఫి బ్యాక్టీరియా మానవులలో మాత్రమే నివసిస్తుంది. టైఫాయిడ్ జ్వరం ఉన్న వ్యక్తులలో బ్యాక్టీరియా మొదట్లో ప్రేగు మార్గం ద్వారా ప్రవేశించి చివరికి రక్తప్రవాహాన్ని ఆక్రమిస్తుంది (Eventually invade the bloodstream). ఫలితంగా వచ్చే అనారోగ్యం తరచుగా నిర్దిష్టంగా ఉండదు మరియు ఇతర జ్వరసంబంధమైన జబ్బుల నుండి వైద్యపరంగా గుర్తించబడదు. లక్షణాలలో ఇవి ఉంటాయి;

  • సుదీర్ఘమైన అధిక జ్వరం (Prolonged high fever),
  • అలసట (Fatigue),
  • తలనొప్పి (Headache),
  • వికారం (Nausea),
  • పొత్తి కడుపు నొప్పి (Abdominal pain),
  • మలబద్ధకం లేదా విరేచనాలు (Constipation or diarrhea),
  • కొన్ని సందర్భాల్లో, కొంతమంది రోగులకు దద్దుర్లు (Rashes) ఉండవచ్చు. తీవ్రమైన కేసులు తీవ్రమైన సమస్యలకు లేదా మరణానికి దారితీయవచ్చు.

టైఫాయిడ్ జ్వరానికి యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలు పోయినప్పటికీ, ప్రజలు ఇప్పటికీ టైఫాయిడ్ బ్యాక్టీరియాను కలిగి ఉంటారు, సుమారు 2-5% కేసులు దీర్ఘకాలిక వాహకాలుగా మారవచ్చు మరియు బ్యాక్టీరియా కొనసాగుతున్న ప్రజల మల విసర్జన (Faecal shedding) వలన మరియు తగిన పరిశుభ్రతలేని కారణంగా ఆహారం (Food) మరియు నీరు (Water) కలుషితం కావడం ద్వారా టైఫాయిడ్ వ్యాప్తికి దోహదపడతారు. టైఫాయిడ్ జ్వరానికి చికిత్స పొందుతున్న వ్యక్తులు ఈ క్రింది విధంగా చేయడం ముఖ్యం:

➢ డాక్టర్ సూచించినంత కాలం సూచించిన యాంటీబయాటిక్స్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం.

➢ బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులను సబ్బు మరియు నీటితో మంచిగా కడుక్కోవడం మరియు ఇతర వ్యక్తులకు ఆహారం తయారు చేయడం లేదా వడ్డించడం మానుకోవడం. ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ మరొకరికి అంటుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది.

➢ డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు వాడిన తర్వాత సాల్మొనెల్లా టైఫి బ్యాక్టీరియా శరీరంలో ఉండకుండా చూసుకోవడానికి డాక్టర్ సలహాతో తగిన టెస్ట్ చేసుకోవడం.


నివారణ మరియు నియంత్రణ (Prevention and control):

సురక్షితమైన నీరు మరియు తగినంత పరిశుభ్రత (Safe water and adequate sanitation), హెల్త్ ఎడ్యుకేషన్, ఫుడ్ హ్యాండ్లర్‌లలో తగిన పరిశుభ్రత మరియు టైఫాయిడ్ వ్యాక్సిన్లు అన్నీ టైఫాయిడ్ నివారణ మరియు నియంత్రణ కోసం సమర్థవంతమైన వ్యూహాలు.

టైఫాయిడ్‌ను నివారించడానికి వ్యాక్సిన్ లు చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి; ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు:

➢ 2 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు శుద్ధి చేయబడిన యాంటిజెన్ (Purified antigen) ఆధారంగా ఒక ఇంజెక్టబుల్ వ్యాక్సిన్ (Injectable vaccine). 

➢ 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి కోసం క్యాప్సూల్ ఫార్ములేషన్‌లో లైవ్ అటెన్యూయేటెడ్ ఓరల్ వ్యాక్సిన్ (Live attenuated oral vaccine).

ఈ వ్యాక్సిన్ లు దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అందించవు మరియు 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆమోదించబడవు.

➢ 6 నెలల నుండి 45 సంవత్సరాల వరకు పిల్లలు మరియు పెద్దల కోసం టెటానస్ టాక్సాయిడ్ ప్రోటీన్‌తో (Tetanus toxoid protein) అనుసంధానించబడిన Vi యాంటిజెన్‌తో కూడిన కొత్త ఇంజెక్టబుల్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్ (Newer injectable typhoid conjugate vaccine). ఈ వ్యాక్సిన్ ను డిసెంబర్ 2017 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టైఫాయిడ్ కోసం మొదటి కాంజుగేట్ వ్యాక్సిన్ ను ప్రీక్వాలిఫై చేసింది. ఈ కొత్త వ్యాక్సిన్ పాత వ్యాక్సిన్ల కంటే దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని (Longer-lasting immunity) కలిగి ఉంది, తక్కువ మోతాదులు మాత్రమే అవసరం అవుతాయి, మరియు 6 నెలల వయస్సు నుండి పిల్లలకు ఇవ్వవచ్చు. 

ఏది ఏమయినా, తప్పుకుండా వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత ఉండాలి మరియు కలుషితమైన ఆహారం మరియు నీటిని వినియోగించకుండా జాగ్రత్త వహించాలి, ఎందుకంటే వ్యాక్సిన్లు 100% సంరక్షణను అందించవు (Because vaccines do not provide 100% protection).


What is typhoid fever? in Telugu:

Post a Comment

0Comments

Post a Comment (0)