హైపర్ టెన్షన్ లేదా రక్తపోటు అంటే ఏమిటి?
హైపర్ టెన్షన్ (Hypertension), దీనిని అధిక లేదా పెరిగిన రక్తపోటు (High or raised blood pressure) అని కూడా అంటారు. ఈ పరిస్థితిలో రక్తనాళాలు (Blood vessels) నిరంతరం ఒత్తిడిని పెరిగి ఉంటాయి, ఇది వాటిని ఎక్కువగా ఒత్తిడికి గురిచేస్తుంది. గుండె కొట్టుకునే (Heart beats) ప్రతిసారీ రక్తాన్ని రక్తనాళాలలోనికి (Blood vessels) పంప్ చేస్తుంది, ఇది రక్తాన్ని (Blood) శరీరం అంతటా తీసుకువెళుతుంది. అయితే ఒత్తిడి సమయంలో గుండె ద్వారా రక్తం పంప్ చేయబడినప్పుడు రక్తనాళాల (ధమనులు-Arteries) గోడలకు రక్తం నెట్టడం ద్వారా రక్తపోటు (Blood Pressure-BP) సృష్టించబడుతుంది. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉంటే, గుండె (Heart) అంత గట్టిగా రక్తాన్ని పంప్ చేయవలసి వస్తుంది. రోజు వారి కార్యకలాపాల ఆధారంగా రోజంతా రక్తపోటు మారుతుంది.
సాధారణ పెద్దల రక్తపోటు గుండె కొట్టుకున్నప్పుడు (సిస్టోలిక్) BP 120 mm Hgగా మరియు గుండె రిలాక్స్ అయినప్పుడు (డయాస్టొలిక్) BP 80 mm Hgగా ఉంటే సాధారణ రక్తపోటుగా (Normal Blood Pressure-NBP: 120/80 mm Hg) నిర్వచిస్తారు. సిస్టోలిక్ అంటే గుండె కొట్టుకున్నప్పుడు (Heart beats) రక్తపోటు BP 140 mm Hgకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మరియు/లేదా డయాస్టొలిక్ అంటే గుండె రిలాక్స్ అయినప్పుడు (Heart relaxes) రక్తపోటు BP 90 mm Hgకి సమానంగా లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు రక్తపోటు (BP) పెరిగినట్లు లేదా ఎక్కువగా ఉన్నట్టు పరిగణించబడుతుంది. రక్తపోటు స్థాయిలు (Blood Pressure Levels) సాధారణం కంటే ఎక్కువగా ఉండి (Above normal) మరియు స్థిరంగా (Consistently) ఉంటే అధిక రక్తపోటు (High Blood Pressure-HBP) లేదా హైపర్ టెన్షన్ (Hypertension) ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు.
అధిక రక్తపోటు (High Blood Pressure-HBP) లేదా హైపర్ టెన్షన్ (Hypertension) ఉన్న చాలా మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు (No symptoms), అందుకే దీనిని "సైలెంట్ కిల్లర్-Silent killer" అని పిలుస్తారు. కొన్నిసార్లు హైపర్ టెన్షన్ వల్ల తలనొప్పి (Headache), శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం (Shortness of breath), తల తిరగడం (Dizziness), ఛాతీ నొప్పి (Chest pain), గుండె దడ (Palpitations of the heart-(Irregular heart beat) మరియు ముక్కు నుంచి రక్తం కారడం (Nose bleeding) వంటి లక్షణాలు కనిపిస్తాయి, అయితే ఈ లక్షణాలు అప్పుడప్పుడు (Occasionally) మాత్రమే కనిపిస్తాయి, ఎప్పటికీ ఉండకపోవచ్చు. రక్తపోటు స్థాయిలు (Blood Pressure Levels) ఎక్కువగా ఉంటే, గుండె జబ్బులు (Heart disease), గుండెపోటు (Heart attack) మరియు స్ట్రోక్ (Stroke) వంటి ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
2017 సంవత్సరం నుండి రక్తపోటు స్థాయిలు (Blood Pressure Levels), సిస్టోలిక్ (Systolic) 130 mm Hg or higher, డయాస్టొలిక్ (Diastolic) 80 mm Hg or higher ను అంటే (HBP: 130/80 mm Hg లేదా ఎక్కువ) నే అధిక రక్తపోటు (High Blood Pressure-HBP) లేదా (Hypertension) గా చెబుతున్నారు.