Uses of Azopt (Brinzolamide Ophthalmic Suspension) in Telugu

Uses of Azopt (Brinzolamide Ophthalmic Suspension) in Telugu:

Uses of Azopt (Brinzolamide Ophthalmic Suspension) in Telugu | అజోప్ట్ (బ్రింజోలమైడ్ ఆప్తాల్మిక్ సస్పెన్షన్) యొక్క ఉపయోగాలు:  అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) మెడిసిన్ యొక్క జెనరిక్ పేరు: బ్రింజోలమైడ్ (Brinzolamide) (ఆప్తాల్మిక్ సస్పెన్షన్).

అజోప్ట్ (బ్రింజోలమైడ్ ఆప్తాల్మిక్ సస్పెన్షన్) యొక్క ఉపయోగాలు:

అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) మెడిసిన్ యొక్క జెనరిక్ పేరు: బ్రింజోలమైడ్ (Brinzolamide) (ఆప్తాల్మిక్ సస్పెన్షన్). 

ఉపయోగాలు: అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) బ్రింజోలమైడ్ మెడిసిన్ ను గ్లాకోమా లేదా ఇతర కంటి వ్యాధులు (ఉదా: కంట్లో ఒత్తిడి) కారణంగా కంటి లోపల అధిక ఒత్తిడికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కంటి లోపల అధిక ఒత్తిడిని తగ్గించడం ద్వారా అంధత్వాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కంటిలోని ద్రవం బయటకు పోకుండా పేరుకుపోవడం వలన కంట్లో ఒత్తిడి (ఆక్యులార్ హైపర్టెన్షన్) పెరిగి కంటి వెనుక భాగం పాడవుతుంది, ఆక్యులార్ హైపర్టెన్షన్ దాంతో గ్లాకోమా మరియు అంధత్వం వంటివి ఏర్పడవచ్చు. ఈ పరిస్థితులకు మరియు లక్షణాలకు చికిత్స, నియంత్రణ, నివారణ మరియు మెరుగుదల కొరకు ఈ అజోప్ట్ ఐ డ్రాప్స్ ను ఉపయోగిస్తారు. కంటిలోని ద్రవాన్ని మొత్తాన్ని తగ్గించడం ద్వారా ఈ మెడిసిన్ పనిచేస్తుంది. ఇది కార్బోనిక్ అన్హైడ్రేస్ ఇన్హిబిటర్స్ అని పిలువబడే మెడిసిన్ల తరగతికి చెందినది.

సైడ్ ఎఫెక్ట్ లు: అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) బ్రింజోలమైడ్ మెడిసిన్ వలన తాత్కాలికంగా అస్పష్టమైన దృష్టి, మీ నోటిలో చేదుగా, అసాధారణమైన రుచి, కళ్లు పొడిబారడం, తాత్కాలిక అసౌకర్యం, దురద, కళ్లు ఎర్రబడడం, మీ కంటిలో ఏదో ఉన్నట్లుగా అనిపించడం, మరియు తలనొప్పి వంటి సాధారణ సైడ్ ఎఫెక్ట్ లు సంభవించవచ్చు. ఈ ప్రభావాలలో ఏవైనా కొనసాగితే లేదా తీవ్రరూపం దాల్చినట్లయితే, మీ డాక్టర్ ని వెంటనే కలవాలి. ఈ మెడిసిన్ ను ఉపయోగించే చాలా మంది వ్యక్తులకు తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు కలిగి ఉండరు. మీకు ఈ అరుదైన కానీ చాలా తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు ఏవైనా ఉంటే మీ డాక్టర్ ని వెంటనే కలవాలి.

జాగ్రత్తలు: అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) బ్రింజోలమైడ్ మెడిసిన్ తీసుకునే ముందు, మీ ప్రస్తుత మందుల జాబితాను డాక్టర్ కి తెలియజేయండి, ఉదా: విటమిన్లు, మూలికా మందులు, ఇతర మందులు, తదితర అలెర్జీలు, ముందుగా ఉన్న వ్యాధులు, మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు అంటే, గర్భం, తల్లి పాలు ఇవ్వడం, రాబోయే శస్త్రచికిత్స మొదలైనవి. ప్రత్యేకించి: ఇతర కంటి పరిస్థితులు, మూత్రపిండ సమస్యలు, కాలేయ వ్యాధి, మీకు కంటి ఇన్ఫెక్షన్ లేదా గాయం లేదా కంటి శస్త్రచికిత్స ఉంటే, ఇలాంటి విషయాలు ముందుగానే మీ డాక్టర్  చెప్పాలి. కొన్ని ఆరోగ్య పరిస్థితులు మిమ్మల్ని మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లకు లోనయ్యేలా చేస్తాయి. మీ డాక్టర్ చెప్పినట్టు పాటించడం లేదా ఉత్పత్తి మీద ముద్రించిన విధంగా పాటించాలి. సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు. ఎక్కువ మోతాదు తీసుకోవడం వల్ల మీ లక్షణాలు మెరుగు పడవు, తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్ లు కలగవచ్చు మీ పరిస్థితిని బట్టి మోతాదు ఉంటుంది. మెడిసిన్ తీసుకునే ముందు గడువు తేదీ చెక్ చేసుకోవాలి. మీ పరిస్థితి ఇంకా అలాగే ఉంటే లేదా ఎక్కువ అయితే మరియు మీ పరిస్థితి మెరుగుపడకపోతే లేదా అది మరింత దిగజారితే వెంటనే మీ డాక్టర్ ను కలవండి.

మోతాదు (డోస్) ఎలా ఉపయోగించాలి: అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) బ్రింజోలమైడ్ మెడిసిన్ మోతాదు (డోస్) మీ డాక్టర్ సూచించినట్లుగా వాడాలి లేదా ఈ ఐ డ్రాప్స్ మోతాదు (డోస్) ప్రభావితమైన కంటిలో సాధారణంగా రోజుకు 3 సార్లు వేసుకోవాలి. ఉపయోగించే ముందు బాటిల్‌ లోని మెడిసిన్ కలర్, పేరుకుపోయినటువంటి పరిస్థితులను గమనించాలి, బాగుంటేనే ఆ మెడిసిన్ వాడాలి. కంటి చుక్కలు (ఐ డ్రాప్స్) వేయడానికి ముందుగా మీ చేతులను శుభ్రంగా కడగాలి. కాలుష్యం కాకుండా ఉండడానికి, డ్రాపర్ ను తాకవద్దు లేదా మీ కంటిని లేదా ఏదైనా ఇతర వస్తువులను తాకవద్దు. ఈ మెడిసిన్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి క్రమం తప్పకుండా ఉపయోగించండి. ప్రతిరోజూ అదే సమయాల్లో దీన్ని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మీరు బాగానే ఉన్నా కూడా అజోప్ట్ ఐ డ్రాప్స్ (Azopt Eye Drops) బ్రింజోలమైడ్ మెడిసిన్ ను ఉపయోగించడం కొనసాగించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, గ్లాకోమా లేదా కంటిలో అధిక ఒత్తిడి ఉన్న చాలా మందికి అనారోగ్యం అనిపించదు. జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుంది. 

మోతాదు (డోస్) మిస్ అయితే: మీరు మెడిసిన్ ఒక మోతాదు (డోస్) మిస్ అయితే, వెంటనే గమనించి తీసుకోండి. ఒకవేళ ఇది తదుపరి మోతాదు తీసుకోవలసిన సమయానికి దగ్గరగా ఉంటే, మిస్ అయిన మోతాదును తీసుకోకుండా, మీ సాధారణ మోతాదు తీసుకునే సమయానికి  తీసుకోండి. మెడిసిన్ మోతాదు (డోస్) మిస్ అయితే డబల్ డోస్ మాత్రం తీసుకోవద్దు. 

స్టోరేజ్: కాంతి, వేడి మరియు తేమ నుండి దూరంగా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. బాత్రూం వంటి ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు. అన్ని మందులను పిల్లలు మరియు పెంపుడు జంతువుల నుండి దూరంగా ఉంచండి, మరియు కలుషితం కాకుండా స్టోరేజ్ చెయ్యాలి. 


Uses of Azopt (Brinzolamide Ophthalmic Suspension) in Telugu:

Post a Comment

0 Comments